దీపికతో సరసాలపై రణ్‌వీర్ హాట్ కామెంట్స్: సీక్రెట్ లీక్ చేసి పరువు పోగొట్టుకున్నాడు
సినీ రంగంలోని ఆర్టిస్టుల మధ్య ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే పెళ్లి పీటల వరకు వెళ్తుంటాయి. అలా చాలా కాలం పాటు ప్రేమించుకుని అగ్నిసాక్షిగా ఒక్కటైన జంటల్లో దీపిక పదుకొనే.. రణ్‌వీర్ సింగ్ జంట ఒకటి. ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్ స్టార్లుగా వెలుగొందుతోన్న ఈ ఇద్దరూ.. కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఈ నేపథ్యంలో దీపికతో సరసాల గురించి తాజాగా రణ్‌వీర్ హాట్ కామెంట్స్ చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ వివరాలు మీకోసం.!

లవ్ ఎఫైర్ల విషయంలో ఇద్దరూ ఇద్దరే
చాలా కాలంగా బాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు దీపిక పదుకొనే.. రణ్‌వీర్ సింగ్. వీళ్లిద్దరూ కలవడానికి ముందు వరకూ కొన్ని ప్రేమ వ్యవహారాలను నడిపిన విషయం తెలిసిందే. రణ్‌వీర్ ఒకరిద్దరు హీరోయిన్లతో డేటింగ్ చేయగా... దీపిక మాత్రం క్రికెటర్లు ధోనీ, యువరాజ్ సింగ్‌లో లవ్ ట్రాక్ నడిపింది. అలాగే, కొందరు హీరోలతోనూ చెట్టాపట్లాలేసుకుని తిరిగింది.

అతడితో పెళ్లి అనుకుంటే ఇలా అయింది
దీపిక పదుకొనే.. ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడితోనూ డేటింగ్ చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ సింగ్ ప్రేమలో పడింది. ఆ సమయంలోనే అతడిని వివాహం చేసుకుంటుందని ప్రచారం కూడా జరిగింది. కానీ, వాళ్లిద్దరికి బ్రేకప్ అవడం.. ఆ వెంటనే రణ్‌వీర్ సింగ్‌తో ప్రేమ... వివాహం చేసుకోవడం చకచకా జరిగిపోయాయి.

మాజీ ప్రియుడి గుర్తు.. చెరిగిపోయింది
రణ్‌బీర్ సింగ్‌తో దీపిక ఎఫైర్ నడుపుతున్న సమయంలో అతడి గుర్తుగా ‘RK' అని టాటూ వేయించుకుంది. దానిని రణ్‌వీర్ సింగ్‌తో వివాహం అయిన తర్వాత కూడా అలాగే ఉంచుకుంది. దీంతో ఈ టాటూ గురించి చాలా కాలం పాటు వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం దీపిక పదుకొనే మెడపై ఉన్న ఆ టాటూ కనిపించకుండా పోయింది.

రణ్‌వీర్ మీసాలు కత్తిరించేసిన దీపిక
వివాహం తర్వాత దీపిక పదుకొనే.. రణ్‌వీర్ సింగ్ తమ తమ సినిమాల్లో బిజీ బిజీగా ఉంటున్నప్పటికీ... ఎక్కువ సమయం కలిసే తిరుగుతున్నారు. మరీ ముఖ్యంగా ఇంట్లో ఎలా ఉంటారన్న దానిపై సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతుంటారు. ఇందులో భాగంగానే ఆ మధ్య రణ్‌వీర్ మీసాలు కత్తిరించింది దీపిక. అంతేకాదు, ఆ వీడియోను పోస్ట్ చేసింది కూడా.

దీపికతో సరసాలపై రణ్‌వీర్ హాట్ కామెంట్స్
లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు దీపిక పదుకొనే.. రణ్‌వీర్ సింగ్. ఈ నేపథ్యంలో ఎంతో సరదాగా గడుపుతున్నారు. ఈ విషయాన్ని రణ్‌వీర్ స్వయంగా వెల్లడించాడు. రెండు రోజుల క్రితం అతడు యంగ్ హీరో ఆయుశ్మాన్ ఖురానాతో సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా దీపికతో సరసాలపైనా హాట్ కామెంట్స్ చేశాడు.
Recommended Video

సీక్రెట్ లీక్ చేసి పరువు పోగొట్టుకున్నాడు
ఆయుశ్మాన్ ఖురానాతో చాట్ చేస్తున్న సమయంలో రణ్‌వీర్ ‘బై బై' అని చెప్పాడు. దీనికి అతడు ‘అప్పుడే బై ఏంటి బాయ్' అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ‘మీ వదిన పిలుస్తోంది. గట్టిగా మాట్లాడొద్దని బెదిరిస్తోంది. అసలే ఆమె నన్ను బాగా తిడుతుంటుంది. అంతేకాదు, ముద్దొచ్చినప్పుడు కొడుతుంది కూడా' అని చెప్పడంతో నెటిజన్స్ హేళన చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











