హీరో పిల్లచేష్టలతో ఫ్యాన్స్‌కు గాయాలు.. మత్తు వదిలించారు, వైరల్ అవుతున్న వీడియో!

గత ఏడాది నవంబర్ లోనే దీపికతో రణవీర్ సింగ్ వివాహం జరిగింది. ఆ తర్వాత విడుదలైన సింబా చిత్రం ఘనవిజయం సాధించింది. త్వరలో రణవీర్, అలియా జంటగా నటించిన గల్లీ బాయ్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ జోష్ లో రణవీర్ సింగ్ తాను ఏం చేస్తన్నాడో తనకే అర్థంకాని పరిస్థితి నెలకొందేమో. పరిణితితో వ్యవహరించాల్సింది పోయి చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు. గల్లీ బాయ్ చిత్ర ప్రచారంలో భాగంగా రణవీర్ ప్రవర్తన విమర్శలకు దారితీసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం!

జోష్ ఎక్కువైందా

తన ప్రేయసితో పెళ్లి, సింబా విజయం ఇలా వరుసగా రణవీర్ సింగ్ సంతోషంలో మునిగితేలుతున్నారు. రణవీర్ సింగ్ తాజాగా నటించిన గల్లీ బాయ్ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్ర పాటలు ఆకట్టుకుంటున్నాయి. రణవీర్ సింగ్ లో జోష్ ఎక్కువైనట్లు ఉంది. గల్లీ బాయ్ ప్రచార కార్యక్రమాల్లో వింతగా ప్రవర్తిస్తున్నాడు. గల్లీ బాయ్ ప్రమోషనల్ ఈవెంట్ ఇటీవల ముంబైలో జరిగింది. ఈ ఈవెంట్ లో రణవీర్ కొంతమంది అభిమానులు గాయపడడానికి కారణం అయ్యాడు.

అభిమానులపై దూకి

అభిమానులపై దూకి

లక్మే ఫ్యాషన్ వీక్ లో రణవీర్ మెరిశాడు. రణవీర్ ని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అప్పటివరకు అభిమానులని ఉత్సాహపరిచిన రణవీర్ ఒక్కసారిగా వేదికపై నుంచి అభిమానుల మీదికి దూకాడు. రణవీర్ అనుకోకుండా దూకడంతో అతడి కిందపడి కొంత మంది అభిమానులకు గాయాలయ్యాయి. ఓ లేడి ఫ్యాన్ గాయం కావడంతో కింద కూర్చుని ఉన్న ఫోటో వైరల్ అవుతోంది.

మత్తు వదిలించారు

మత్తు వదిలించారు

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనితో నెటిజన్లు రణవీర్ సింగ్ కు మత్తు వదిలిస్తున్నారు. రణవీర్ సింగ్ పిల్ల చేష్టలు చేయకు. కాస్త పరిణితి సాధించు అని కామెంట్స్ చేస్తున్నారు. రణవీర్ ఒక్కసారిగా దూకడం వలన అభిమానుల్లో తొక్కిసలాట జరిగి కూడా కొంతమంది గాయపడ్డారు. రణవీర్ కలలో ఉన్నాడు. అందుకే ఇలాంటి పిచ్చిపనులు చేస్తున్నాడు అంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

కేర్‌ఫుల్‌గా ఉంటా

ఓ నెటిజన్ ఈ ఘటన గురించి, తనపై వస్తున్న విమర్శల గురించి రణవీర్ కు తెలియజేశాడు. దీనిపై రణవీర్ స్పందిస్తూ.. ఈ సంఘటనని దృష్టిలో పెట్టుకుంటా.. ఇకపై జాగ్రత్తగా ఉంటా అని తెలిపాడు. జోయా అక్తర్ దర్శకత్వంలో గల్లీ బాయ్ చిత్రం రూపొందింది. ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X