భార్యభర్తల పబ్లిక్ ముద్దు.. సెక్సీ అంటూ..! ఇద్దరూ బడా స్టార్స్ కావడంతో వీడియో సెన్సేషన్

బుధవారం రాత్రి జరిగిన ఐఫా-2019 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌‌వీర్ సింగ్ తన భార్య దీపికా పదుకొనెకు అందరి ముందే ముద్దు పెట్టేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ రణ్‌‌వీర్ అలా పబ్లిక్‌గా ఎందుకు ముద్దు పెట్టారు? దీపికా ఎలా రియాక్ట్ అయింది? ఆ వివరాలేంటో చూద్దామా..

ఐఫా అవార్డ్స్ 2019

ఐఫా అవార్డ్స్ 2019

మహారాష్ట్ర రాష్ట్రం లోని ముంబై నగరంలో బుధవారం రాత్రి ఐఫా అవార్డ్స్ 2019 వేడుక జరిగింది. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. నటీనటులు, డాన్సర్ల డాన్సులతో ఐఫా అవార్డ్స్ వేదిక హోరెత్తింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో నటీనటులకు అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.

ఉత్తమ నటుడిగా రణవీర్ సింగ్ ఎంపిక

ఉత్తమ నటుడిగా రణవీర్ సింగ్ ఎంపిక

ఉత్తమ నటుడిగా రణవీర్ సింగ్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డు దక్కించుకున్నారు. 'పద్మావత్' సినిమాలో ఆయన చూపిన అభినయానికి గాను రణవీర్ సింగ్‌ను ఐఫా అవార్డు వరించింది. అదేవిధంగా ‘అంధాధూన్' సినిమా దర్శకుడు శ్రీరాం రాఘవన్‌కు ఉత్తమ దర్శకుడి కేటగిరీలో ఐఫా అవార్డు లభించింది.

బాలీవుడ్ భార్యభర్తల పబ్లిక్ ముద్దు

బాలీవుడ్ భార్యభర్తల పబ్లిక్ ముద్దు

అయితే అవార్డు తీసుకోవాలని ఆయన పేరును అనౌన్స్ చేయగానే.. వేదిక పైకి వెళ్ళడానికి ముందే రణవీర్ సింగ్ తన సతీమణి అయిన బాలీవుడ్ నటి దీపిక పదుకొనెను ముద్దాడారు. ఆనందంతో రణవీర్ పెట్టిన ఈ పబ్లిక్ ముద్దు కెమెరాలకు చిక్కడంతో నెట్టింట వైరల్ అయింది. ఈ బాలీవుడ్ భార్యభర్తల ముద్దు చూసి మురిసిపోతున్నారు నెటిజన్లు.

దీపికా సెక్సీ అంటూ

ఇక భార్య దీపికా గురించి మాట్లాడిన రణవీర్ సింగ్.. ఆమె అందాన్ని తెగ పొగిడేశారు. లండన్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన దీపికా పదుకొనె మైనపు బొమ్మ అందరికంటే సెక్సీగా ఉందంటూ రణవీర్ కామెంట్ చేయడం విశేషం.

బెస్ట్ ఫిమేల్ యాక్టర్‌గా

బెస్ట్ ఫిమేల్ యాక్టర్‌గా

ఇకపోతే.. ఐఫా అవార్డ్స్ 2019 బెస్ట్ ఫిమేల్ యాక్టర్‌ అవార్డు ఆలియా భట్‌ని వరించింది. ‘రాజీ' సినిమాలో ఆలియాభట్ ప్రదర్శించిన నటనకు గాను ఉత్తమ నటి అవార్డు ఆమెను వరించింది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డు గెలుచుకున్న ఆలియాభట్ వేదికపై తన ఆనందాన్ని వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X