twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కపిల్ దేవ్ కసి కనిపిస్తోంది.. అచ్చం ఆయన లాగే ఉన్నాడుగా!

    |

    టాలీవుడ్, బాలీవుడ్ సహా అన్ని భాషా చిత్రాల్లో బయోపిక్‌ల హంగామా పెరిగిపోయింది. గొప్ప వ్యక్తుల జీవిత కథలను లేదా వారు సాధించిన ఘనతలను వెండితెరపై చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో అలాంటి సినిమాలు రూపొందించేందుకే దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సాధించిన ఘనతను కళ్ళకు కట్టినట్లు చూపే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్ కబీర్ ఖాన్.

    భారత క్రికెట్ చరిత్రలో 1983 ప్రపంచ కప్ ఎప్పటికీ చిరస్మరణీయం. మొదటిసారి భారత జట్టు అందుకున్న ప్రపంచ కప్ అది. ఈ తరువాత ఇండియన్ క్రికెట్ దశ అమాంతం మారిపోయింది. క్రికెట్ జట్టుకు కొండంత బలం చేకూరింది. అప్పట్లో భారత జట్టు సాధించిన ఈ విజయం దేశంలోని పల్లె పల్లెనా సంబరాలు నింపింది. అయితే ఈ ఘట్టాన్ని ప్రధానంగా తీసుకొని దర్శకుడు కబీర్ ఖాన్ '83' పేరుతో కపిల్ దేవ్ బయోపిక్ తెరకెక్కిస్తున్నాడు. చిత్రానికి విష్ణు ఇందూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌వీర్ సింగ్ నటిస్తున్నాడు. ఆయన సరసన దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది.

     Ranveer Singh Look Like Kapil Dev In 83

    అయితే తాజాగా '83' సినిమాలో కపిల్ దేవ్ లుక్ రివీల్ చేసింది చిత్రయూనిట్. ఈ రోజు (జులై 6) ర‌ణ‌వీర్ సింగ్ పుట్టినరోజు కానుకగా ఈ లుక్ విడుదల చేశారు. ఇందులో హీరో ర‌ణ‌వీర్ సింగ్ అచ్చం కపిల్ దేవ్ లాగాగే ఎంతో కసితో కనిపిస్తున్నాడు. తన లుక్‌ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ర‌ణ‌వీర్ సింగ్.. 'నా స్పెషల్ రోజైన నేడు హర్యానా కింగ్‌ని మీకు పరిచయం చేస్తున్నాను' అని పేర్కొన్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రయూనిట్.

    English summary
    In Bollywood Kapil Dev biopic movie shooting is running successfully. In this movie Ranveer Singh and Deepika Padukone playing lead roles. Now Kapil Dev look is released from this movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X