twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ranveer Singh: బట్టలు లేకుండా నగ్నంగా హీరో ఫొటోషూట్.. ఈ దారుణాన్ని చూస్తే షాక్ అవ్వాల్సిందే!

    |

    సినిమా ప్రపంచంలో కొంతమంది సినీ తారలు నిర్వహించే ఫోటోషూట్స్ ఊహలకు అందని విధంగా ఉంటాయి. ఎక్కువగా అందరినీ ఆకట్టుకోవాలి అని హీరోయిన్స్ గ్లామర్ లుక్స్ లో కనిపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అర్థనగ్నంగా కూడా షాక్ ఇస్తూ ఉంటారు. అయితే హీరోయిన్స్ తో పాటు అప్పుడప్పుడు కొంతమంది బాలీవుడ్ హీరోలు కనిపిస్తున్న విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రీసెంట్గా మరొక బాలీవుడ్ హీరో ఏకంగా ఒంటి మీద ఒక్క నూలు పోగు లేకుండా ఫోటోషూట్ లో పాల్గొనడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే..

    నగ్నంగా.. న్యూ ట్రెండ్

    నగ్నంగా.. న్యూ ట్రెండ్

    బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ నగ్నంగా కూడా ఫోటోషూట్ లో పాల్గొన్నారు. మరికొందరు అయితే అర్ధనగ్నంగా పాల్గొని ఊహించిన విధంగా షాక్ ఇచ్చారు. ఎవరు అలా కనిపించినా కూడా వారి ఫోటోలు నిమిషాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి. ఇక సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ఇంకా ఆ ట్రెండ్ మరింత పెరిగింది.. హాలీవుడ్ లో అయితే ఎప్పటినుంచో ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది.

    నగ్నంగా రణ్ వీర్

    నగ్నంగా రణ్ వీర్

    ఇక ఈసారి టాలెంటెడ్ హీరో రణ్ వీర్ సింగ్ కూడా అదే తరహాలో షాక్ ఇవ్వడం విశేషం. ఇటీవల పేపర్ మ్యాగజైన్ కోసం నటుడి వైరల్ ఫోటో సిరీస్‌లో అతను వవిభిన్నమైమ ఆహార్యం కలిగిన జుట్టుతో నగ్నంగా, కార్పెట్‌పై కూర్చొని కెమెరాకు పోజులిచ్చాడు. మరొక ఫోటోలు పడుకొని కూడా రణ్ వీర్ సింగ్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    సోషల్ మీడియాలో ట్రోలింగ్

    సోషల్ మీడియాలో ట్రోలింగ్

    అయితే గతంలో జాన్ అబ్రహం కూడా ఇదే తరహాలో ఫోటోలకు న్యూడ్ గా ఫోజులు ఇవ్వడంతో దారుణంగా ట్రోలింగ్ అయితే జరిగింది. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో రణ్ వీర్ నగ్నంగా ఇచ్చిన ఫోటోషూట్ పై రకరకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఫోటోషూట్ ను మీ నుంచి అసలు ఊహించలేదు అని అంటున్నారు. ఇక ఇందులో ఎంతో అర్థవంతమైన భావం ఉందని కూడా మరికొందరు చెబుతూ ఉండడం విశేషం.

     వరుసగా అపజయాలు

    వరుసగా అపజయాలు

    గత కొంతకాలంగా రణవీర్ సింగ్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ అందుకోవడంలేదు. ఎలాంటి సినిమా చేసిన కూడా తీవ్ర స్థాయిలో నిరాశ పరుస్తూ వస్తున్నాయి. చివరగా రణ్ వీర్ సింగ్ 1983 వరల్డ్ కప్ ఆధారంగా కపిల్ దేవ్ బయోపిక్ లో నటించిన విషయం తెలిసిందే. 83 అనే ఆ సినిమా ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టుగానే ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయ్యింది.

    నెగిటివ్ గానే..

    నెగిటివ్ గానే..

    ఇక అతని వరుస సినిమాలు డిజాస్టర్ కావడంతో ఈ పరిస్థితికి వచ్చాడు అని మరికొందరు సోషల్ మీడియాలో ఊహించిన విధంగా నెగిటివ్ ట్రోలింగ్ అయితే కొనసాగిస్తున్నారు. మరి కొంతమంది అతని ఫోటోలను ఎడిట్ చేసి దుప్పటి కప్పి మరి వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఏదేమైనా కూడా రణ్ వీర్ సింగ్ ఈ ఫోటోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. మరి ఈ ట్రోల్స్ పై అతను ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూడాలి.

    English summary
    Ranveer Sing naked photoshoot big trolling in social media
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X