రణవీర్ సింగ్ కండోమ్ బ్రాండ్ కాంట్రాక్ట్ రద్దు.. కారణం దీపిక?

కండోమ్స్ లాంటి బ్రాండ్స్ ప్రచారం చేయడానికి స్టార్ హీరోలు, మెయిన్ స్ట్రీమ్ యాక్టర్లు అంతగా ఆసక్తి చూపరు. అలాంటి తరుణంలో డ్యూరెక్స్ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కాంట్రాక్టు కుదుర్చుకుని ఐదేళ్ల క్రితమే సెన్సేషన్ క్రియేట్ చేశాడు రణవీర్ సింగ్. అయితే ఇకపై రణవీర్ సింగ్ కండోమ్ యాడ్లలో కనిపించక పోవచ్చు!

బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం...సదరు కండోమ్ కంపెనీ ఇకపై రణవీర్ సింగ్ కాంట్రాక్టు పునరుద్దరణ చేసే ఆలోచనలో లేదట. ఈ విషయాన్ని రణవీర్ సింగ్ సన్నిహితులు కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇరు వర్గాలు స్నేహ పూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కారణం దీపిక పదుకోన్?

కారణం దీపిక పదుకోన్?

అయితే సదరు కంపెనీ రణవీర్ సింగ్‌తో కాంట్రాక్ట్ రద్దు చేసుకోవడానికి కారణం దీపిక పదుకోన్‌తో అతడి వివాహం జరుగడమే అని తెలుస్తోంది. దీంతో పాటు రణవీర్ సింగ్ ఎక్కువ పారితోషికం డిమాండ్ చేయడం కూడా ఈ కాంట్రాక్ట్ రద్దు కావడానికి మరో కారణంగా చెబుతున్నారు.

దీపిక-రణవీర్

దీపిక-రణవీర్

రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ గతేడాది నవంబర్లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని కూడా సదరు కండోమ్ కంపెనీ తమ ప్రచారానికి వాడుకుంటూ ట్వీట్ చేయడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఇకపై దీపిక, రణవీర్ అఫీషియల్‌గా కండోమ్స్ వాడతారు అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది.

రణవీర్ ఎఫెక్ట్, పెరిగిన కండోమ్ అమ్మకాలు

రణవీర్ ఎఫెక్ట్, పెరిగిన కండోమ్ అమ్మకాలు

రణవీర్ సింగ్ ప్రచారం చేయడం వల్ల ఇండియాలో కండోమ్స్ అమ్మకం, ప్రత్యేకించి సదరు బ్రాండ్ అమ్మకాలు బాగా పెరిగాయట. ఒక స్టార్ హీరో ప్రచారం చేయడం వల్ల కండోమ్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడేవారి సంఖ్య కూడా ఎక్కువైంది.

రణవీర్ వాలెట్‌లో కండోమ్

రణవీర్ వాలెట్‌లో కండోమ్

గతంలో తను ప్రచారం చేస్తున్న కండోమ్ ప్రొడక్ట్ ప్రమోషన్ ఇంటర్వ్యూలో రణవీర్ సింగ్ మాట్లాడుతూ... తన వాలెట్‌లో ఎప్పుడూ ఒక కండోమ్ ఉంటుందని చెప్పి సంచలనం క్రియేట్ చేశారు. కండోమ్ మనతో ఉంటే ఎప్పుడంటే అప్పుడు హెచ్.ఐ.వి, సుఖవ్యాధులు, అవాంచిత గర్భం రాకుండా సురక్షిత శృంగారంలో పాల్గొనవచ్చు అంటూ రణవీర్ సింగ్ ప్రచారం హోరెత్తించారు.

రణవీర్ సింగ్ 83

రణవీర్ సింగ్ 83

సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రణవీర్ సింగ్ తన నెక్ట్స్ మూవీ ‘83' కోసం సిద్ధం అవుతున్నాడు. ఇండియన్ లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా క్రికెట్ బ్యాక్ డ్రాపులో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మరో వైపు దీపిక పదుకోన్ ‘ఛపాక్' అనే చిత్రం చేస్తోంది. ఢిల్లీ యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X