twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రికెటర్ అవ్వాలనుకున్న రణవీర్ సింగ్... ఆ కల ఎలా చెదిరిందంటే?

    |

    ఈ తరం బాలీవుడ్ నటుల్లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నవారిలో రణవీర్ సింగ్ ఒకరు. 2010లో 'బ్యాండ్ బాజా భారత్' సినిమా ద్వారా కెరీర్ మొదలు పెట్టిన రణవీర్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. లూటేరా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ లాంటి చిత్రాల్లో తన యాక్టింగ్ టాలెంటుతో ఆకట్టుకున్నాడు.

    వాస్తవానికి రణవీర్ సింగ్ చిన్నతనం నుంచి యాక్టర్ అవ్వాలని కలలు కనలేదు. స్టోర్ట్స్ మ్యాన్ అవ్వాలనుకున్నాడు. తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముంబయిలోకి జింఖానా క్రికెట్‌ క్లబ్‌‌లో చేరాడు. మొహీందర్‌ అమర్‌నాథ్‌ వద్ద శిక్షణ తీసుకున్నాడు. కానీ అది వర్కౌట్ కాలేదు.

    Ranveer Singh rejected from playing Cricket

    నెట్స్‌లో తన ఆటతీరుతో కోచ్‌ను మెప్పించలేక పోయిన రణవీర్.... దాన్ని వదిలేసి ఆ తర్వాత సినిమా రంగం వైపు అడుగు వేశారు. నిజ జీవితంలో క్రికెటర్ అవ్వాలనే కోరికను మధ్యలోనే వదిలేసిన రణవీర్ త్వరలో '83' అనే సినిమాలో క్రికెటర్‌‌గా కనిపించబోతున్నారు.

    1983లో భారత జట్టు కపిల్‌ సారథ్యంలో ప్రపంచ కప్‌ గెలిచిన నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. కబీర్ ఖాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్‌ పాత్రలో కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

    English summary
    According to a report in Bollywood reports, as a child Ranveer Singh wanted to become a professional cricketer and had tried his luck at the Bombay Gymkhana Club. Singh will be seen playing former Indian cricket captain, who was also captain of the 1983 world cup winning team, Kapil Dev.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X