Koffee With Karan 8 ఆ హీరోయిన్ హ్యాండ్ ఇవ్వడంతో.. నా లైఫ్‌లోకి దీపిక పదుకోన్ .. రణ్‌వీర్ సింగ్
ఇండియన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన షోల విషయానికి వస్తే.. కాఫీ విత్ కరణ్‌కు మంచి పాపులారిటి ఉంది. ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలను 7 సీజన్లుగా ఇంటర్వ్యూలు చేస్తూ అనేక విషయాలను వెలుగులోకి తెచ్చారు. తాజాగా దర్శక, నిర్మాత కరణ్ జోహర్ తన షో 8వ సీజన్‌ను ఆరంభించారు. ఈ షోకు మోస్ట్ పాపులర్ కపుల్ దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి అఫైర్‌కు ముందు, అఫైర్ తర్వాత విషయాలను పూసగుచ్చినట్టు చెప్పారు. దీపిక పదుకోన్ తన జీవితంలోకి ఎలా వచ్చిందనే విషయాన్ని వెల్లడిస్తూ..
రామ్ లీలా సినిమాకు ముందు
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రామ్ లీలా సినిమా ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ముందుగా దీపిక పదుకోన్ బదులు కరీనా కపూర్‌ను అనుకొన్నారు. కొన్ని కారణాల వల్ల షూటింగ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు కరీనా ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నది. దాంతో టీమ్ అంతా కంగారు పడిపోయారు. ఏ హీరోయిన్‌ను తీసుకొంటారనే ఆలోచనల్లో నేను ఉండిపోయాను అని రణ్‌వీర్ సింగ్ చెప్పారు.

కాక్ టెయిల్ సినిమాలో
అయితే చివరకు చాలా మంది హీరోయిన్లను పరిశీలించి చివరకు దీపిక పదుకోన్‌ను తీసుకొన్నారు. అప్పటికే దీపిక నటించిన కాక్‌టెయిల్ సినిమా రిలీజైంది. ఆ సినిమా నేను కూడా చూశాను. అంతకు ముందు నేను దీపికను ఎన్నడూ కలువలేదు. రామ్ లీలా షూటింగుకు ముందు ముంబైలోని సంజయ్ లీలా భన్సాలీ ఇంట్లో ఆమెతో మీటింగ్ ఏర్పాటు చేశారు అని రణ్‌వీర్ సింగ్ చెప్పారు.

దీపికను అలా చూసి..
సంజయ్ లీలా భన్సాలీ ఇంట్లోని గదిలో మీటింగ్ కోసం కూర్చున్నాను. అప్పడు ఒకరు భారీగా ఉండే డోర్లను తీసింది. వెంటనే సముద్రం నుంచి హోరు గాలి ఆమె కంటే ముందే ఇంట్లోకి ప్రవేశించింది. అంతలోనే ఓ సాధ్వి మూర్తిలా ఒకామే నా ముందుకు వచ్చింది. ఆమె జట్టు గాలికి ఎగిరి పడుతున్నది. అలాంటి సీన్‌లో దీపికను మొదటిసారి చూశాను అని రణ్‌వీర్ సింగ్ తెలిపారు.
దీపిక బుగ్గ మీద అలా..
సంజయ్ లీలా భన్సాలీ, దీపికతో మీటింగ్‌లో స్క్రిప్టు, క్యారెక్టర్లు, ఇతర విషయాలు మాట్లాడుకొన్నాం. ఆ మీటింగ్ జరిగిన తర్వాత లంచ్ ఏర్పాటు చేశారు. నేను, దీపిక, సంజయ్ లీలా భన్సాలీ ముగ్గురు డైనింగ్ టేబుల్‌పై కూర్చొన్నాం. క్రాబ్ కర్రీ, భారీ విందుతో భోజనం చేస్తుండగా.. దీపిక బుగ్గమీద క్రాబ్ ముక్క అతికింది. ఆ విషయం ఆమెకు చెబితే. తీసి వేయండి అని చాలా కాజువల్‌గా దీపిక చెప్పింది.

440 ఓల్టేజ్‌తో షాక్
దీపిక ను ఇంప్రెస్ చేయడానికి అదే అదనుగా భావించాను. నా చిటికెన వేలితో మెల్లగా బుగ్గ మీద ఉన్న క్రాబ్ ముక్కను సుతారంగా తీశాను. అప్పుడు ఆమెను తాకగానే నాకు 440 ఓల్టుల షాక్ తగిలింది. ఆ షాక్ ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆ స్పార్క్ నా జీవితాంతం గుర్తుండేలా చేసింది. నాకు దీపికను భార్యగా చేసేలా చేసింది అని రణ్‌వీర్ సింగ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











