అక్షయ్ కంటే ముందే రణ్ వీర్ సినిమా
ఎప్పుడు ప్రేక్షకులతో కళకళలాడే థియేటర్స్ కరోన వల్ల మూతపడ్డాయి . దాదాపు ఏడు నెలలుగా షూటింగ్స్ కూడా లేకపోవడంతో థియేటర్స్ లో బొమ్మ పడడం ఆగిపోయింది. కొన్ని సినిమాలు ఓటీటీ వేదికలుగా విడుదలయ్యేందుకు ముస్తాబవుతున్నాయి.ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీ లో డైరెక్ట్ గా విడుదల అయ్యాయి.
అయితే విడుదల కావాల్సిన సినిమాలో అక్షయ్ కుమార్ నటించిన సూర్య వంశీ , రణ్ వీర్ సింగ్ నటించిన 86 కూడా ఉన్నాయి. సమ్మర్ కు రావాల్సిన ఈ రెండు సినిమాలు వాయిదా పడ్డాయి. ఆ మధ్య ఈ రెండు సినిమాలు ఓటీటీ లో విడుదలవుతున్నాయని ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై స్పష్టత వచ్చింది. కపిల్‌దేవ్ జీవితం ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం '83'. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్ సింగ్, అతడి సతీమణి రోమీ భాటియాగా దీపికా పదుకొనె కనిపించనున్నారు.

ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక అక్షయ్‌కుమార్, కత్రినాకైఫ్, అజయ్‌దేవ్‌గణ్, రణవీర్ సింగ్ కీలక పాత్రల్లో నటించిన 'సూర్యవంశీ' సినిమాకు రోహిత్‌శెట్టి దర్శకత్వం వహించాడు. ఈసినిమా విడుదల 2021కి వాయిదా పడింది. ముందుగా ఈసినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేద్దాం అనుకున్నప్పటికీ వాయిదా వేయక తప్పలేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











