83 movie update: చరిత్రను తిరగరాసిన వేళ.. వైరల్‌గా ఐకానిక్ ఫోటో

బాలీవుడ్ కండల వీరుడు రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న 83 మూవీ రోజు రోజుకు అంచనాలు పెంచుతున్నది. ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ రూపొందిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే క్రీడా పండితుల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. అంచనాలకు తగినట్టే ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ నటించిన ఓ చారిత్రక సంఘటనకు సంబంధించిన ఫోటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది.

అండర్ డాగ్స్‌గా ప్రపంచ కప్‌లో పోటీలో పాల్గొని.. క్రికెట్ దిగ్గజం వెస్టిండీస్‌ను కపిల్ డెవిల్స్ 83లో మట్టికరిపించిన ఘటన భారతీయ క్రీడా రంగానికి ఓ స్ఫూర్తిని రగిలించింది. విజయగర్వంతో కపిల్ దేవ్ ప్రపంచకప్ ట్రోఫిని ఎత్తుకొని ఆ ఫోటో చరిత్రలో నిలిచిపోయింది. ఆ హిస్టారికల్ ఈవెంట్‌ను 83 చిత్రంలో ఇటీవల షూట్ చేసి.. దానికి సంబంధించిన ఫోటోలను క్రీడాభిమానుల కోసం షేర్ చేశారు.

Ranveer Singhs 83 World Cup Lifting Moment goes Viral

83 చిత్రాన్ని నిర్మిస్తున్న రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చారిత్రాత్మక ఫోటోను షేర్ చేసింది. ఇలాంటి గొప్ప సంఘటనను వెండితెరపై చూడటానికి ఆతృతగా వేచి చూస్తున్నాం అని ట్విట్టర్లో పేర్కొన్నది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొంటున్న 83 చిత్రానికి రణ్‌వీర్ సింగ్ సతీమణి, దీపికా పదుకోన్ ఓ నిర్మాత కావడం విశేషం. దీపికతోపాటు కబీర్ ఖాన్, విష్ణు ఇందూరి, సాజిద్ నడియావాలా, ఫాంటమ్ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్‌కు ముస్తాబవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X