twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ పాత్రలో దంచికొట్టాడు.. రణవీర్ పర్ఫెక్ట్, కేక పెట్టించిన సారా!

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం ఘనవిజయం సాధించింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎన్టీఆర్‌ని పూరిజగన్నాథ్ అద్భుతంగా చూపించాడు. వక్కంతం వంశీ పవర్ ఫుల్ స్టోరీ రచించాడు. ఎన్టీఆర్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ చిత్ర రీమేక్ హక్కుల కోసం భారీ డిమాండ్ నెలకొంది. హిందీలో, తమిళంలో ఈ చిత్ర రీమేక్ హక్కులు సొంతం చేసుకునేందుకు నిర్మాతలు ఎగబడ్డారు. తాజాగా హిందీ రీమేక్ ట్రైలర్ విడుదలయింది.

    ఎన్టీఆర్ నటన హైలైట్

    ఎన్టీఆర్ నటన హైలైట్

    టెంపర్ చిత్రంలో ఎన్టీఆర్ నటన హైలైట్ అని చెప్పొచ్చు. పూరిజగన్నాథ్ తనదైన శైలిలో ఎన్టీఆర్ ని కొత్తగా పవర్ ఫుల్‌గా ప్రజెంట్ చేశారు. అవినీతిని ప్రోత్సహించే పోలీసులు అధికారి మంచిగా ఎలా మారాడు అనే కథని బలమైన అంశాలతో చూపించారు. టెంపర్‌లో కాజల్ అందాలు కూడా ప్లస్ అయ్యాయి. అనూప్ రూబెన్స్ సంగీతం కూడా కట్టుకుంది. అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

    రణవీర్ పర్ఫెక్ట్

    రణవీర్ పర్ఫెక్ట్

    రీమేక్ చిత్రం అంటే ఖచ్చితంగా వరిజినల్ వర్షన్‌తో పొలిక ఉంటుంది. హిందీలో ఈ చిత్రాన్ని సింబా పేరుతో రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్నారు. పూర్తిగా టెంపర్ రీమేక్ అనే భావన కలగకుండా దర్శకుడు జాగ్రత్త వహించాడు. ఇక పోలీస్ అధికారి పాత్రలో రణవీర్ సింగ్ పర్ఫెక్ట్ గా కుదిరిపోయాడు. అతడి నటన అదుర్స్ అనిపించే విధంగా ఉంది. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో రణవీర్ హావభావాలు అద్భుతంగా ఉన్నాయి.

     కేకపెట్టిస్తున్న సారా

    కేకపెట్టిస్తున్న సారా

    సారా అలీ ఖాన్ ట్రైలర్‌లో కొన్ని షాట్స్ లో మాత్రమే కనిపించినా అదరగొట్టేసింది. ఆమె పెర్ఫామెన్స్ మతిపోగోట్టే విధంగా ఉంది. బాలీవుడ్‌ని ఏలే ఫ్యూచర్ హీరోయిన్‌గా అప్పుడే సారా అలీఖాన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. దర్శకుడు రోహిత్ శెట్టి ఈ చిత్రాన్ని అజయ్ దేవగన్ సింగం చిత్రానికి కొనసాగింపు అనే కోణంలో కూడా చూపించబోతున్నాడు. అజయ్ దేవగన్ కూడా పవర్ ఫుల్ పోలీస్‌గా ట్రైలర్‌లో కనిపిస్తున్నాడు.

    ప్రతి సన్నివేశం

    ట్రైలర్‌ని బట్టి చూస్తే సింబా చిత్రనిలోని ప్రతి సన్నివేశాన్ని రిచ్ గా తెరకెక్కించారు. ఫైట్స్, పాటలు, హీరోయిన్ గ్లామర్ ఇలా అన్ని అంశాలతో సింబా చిత్రం మాస్ ఆడియన్స్ పండగ చేసుకునేలా ఉండబోతున్న విషయం అర్థం అవుతోంది. డిసెంబర్ 28న సింబా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    Simmba Trailer: Ranveer Singh's bad cop turned good cop act has BLOCKBUSTER written all over it. Simmba is all set to release on December 28.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X