For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా బాయ్‌ఫ్రెండ్‌ను గోకితే అంతే... పోయేటప్పుడు నా గంట తీసుకెళ్తావా? లిప్‌లాక్‌తో అలియా, రణ్‌వీర్

    |

    టెంపర్ రీమేక్ సింబాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకొన్న రణ్‌వీర్ సింగ్ వరుస విజయాలతో హంగామా సృష్టిస్తున్నారు. ఓ పక్క కలెక్షన్ల హోరు కొనసాగిస్తూనే మరో పక్క ఈ ఏడాదిలో మరో సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. రణ్‌వీర్ సింగ్ నటించిన తాజా చిత్రం గల్లీ బాయ్ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ట్రైలర్ ఎలా ఉందంటే..

    ర్యాపర్‌గా రణ్‌వీర్ సింగ్

    ర్యాపర్‌గా రణ్‌వీర్ సింగ్

    ర్యాపర్‌గా యంగ్ యాంగ్రీ మ్యాన్ పాత్రలో రణ్‌వీర్ కనిపించాడు. పక్కాగా టపోరి క్యారెక్టర్‌ను పోషించినట్టు స్పష్టమవుతున్నది. స్ట్రీట్ ఫైట్స్, ఫ్యామిలీ డ్రామా, ర్యాపర్‌గా ఒడిదుడుకులు లాంటి అంశాలు ట్రైలర్‌లో కనిపించాయి. యూత్ ఓరియెంటెడ్ ఎలిమెంట్స్ గల్లీబాయ్ ట్రైలర్‌లో పుష్కలంగా ఉన్నట్టు స్పష్టమైంది.

    2018 పోల్: ఈ హీరోలు, హీరోయిన్ల జాతకాలు మీ చేతుల్లోనే.. ఓట్ వేసి గెలిపించండి!

    యాంగ్రీ ఉమెన్‌గా అలియాభట్

    యాంగ్రీ ఉమెన్‌గా అలియాభట్

    ట్రైలర్‌లో చూపించిన ప్రకారం రణ్‌వీర్‌ సింగ్‌కు ఏమాత్రం తగ్గని ఆవేశం ఉన్న పాత్రలో అలియాభట్ నటించినట్టు స్పష్టమైంది. వంటవచ్చా అని అడిగిన ప్రశ్నకు అలియా సమాధానం ఇస్తూ అంతా సవ్యంగా సాగితే ఏదో రోజు నీ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయగలను అని అంటుంది. ఈ చిత్రంలో సఫీనాగా డాక్టర్ పాత్రలో నటించినట్టు స్పష్టమైంది.

    నీవు గుండావా? అంటే

    నీవు గుండావా? అంటే

    "నా బాయ్‌ఫ్రెండ్‌ను గోకితే గట్టిగా ఒక్కటిస్తాను" అని అలియా చెప్పడం.. దానికి రణ్‌వీర్ "నీవు అంత పెద్ద గుండావా?" ప్రశ్నిస్తాడు. ఓ వ్యక్తిని బాటిల్‌తో తలపై కొట్టి తానేంత పెద్ద గుండానో చేతల్లో చూపిస్తుంది అలియా. ఇద్దరు ఆవేశపరులైన యువ ప్రేమికులుగా రణ్‌వీర్, అలియా కెమిస్ట్రీ బ్రహ్మండంగా కనిపించింది. నీకు ఏది కావాల్సిస్తే అది చేసుకో అంటూ ఆలియా గట్టి లిప్‌లాక్ సీన్‌తో అదరగొట్టింది.

    పేదరికం, భావోద్వేగ అంశాలు

    మధ్య తరగతి కుటుంబంలో ఉంటే అవస్థలు, పేదరికం లాంటి భావోద్వేగమైన అంశాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. తండ్రి కొడుకుల మధ్య సంఘర్షణ ఎమోషనల్‌గా ఉంది. నా కంటూ ఓ రోజు వస్తుందంటూ ఆశగా చూసే రణ్‌వీర్ ట్రైలర్‌లోనే హంగామా చేశాడు. పుట్టినప్పుడు బట్ట కట్టలేదు.. పోయేటప్పుడు నా గంటా తీసుకెళ్తావా అంటూ ఆవేశంగా ర్యాప్ చేస్తున్న రణ్‌వీర్ గల్లీ బాయ్‌ చిత్రంతో యువతలో గిలిగింతలు పెట్టడం ఖాయమనిపిస్తున్నది.

    ఫిబ్రవరి 14న విడుదల

    ఫిబ్రవరి 14న విడుదల

    అలియాభట్, రణ్‌వీర్ సింగ్, కల్కీ కోచ్లీన్ నటించిన గల్లీ బాయ్‌కి జోయా అఖ్తర్ దర్శకురాలు. గతంలో దిల్ చాహ్త హై, జిందగీ న మిలేగి దొబారా లాంటి చిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది.

    English summary
    Ranveer Singh has turned rapper and absolutely killed it in Zoya Akhtar-directed Gully Boy. The trailer of the much-awaited film starring Ranveer and Alia Bhatt as the voice of the streets is finally out.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X