దీపికా నడుము వైపు కొంటెగా చూస్తున్న రణ్‌వీర్.. ఫన్నీ కామెంట్లతో వైరల్ అవుతున్న పిక్
నడుము సీన్ అంటే మన తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషీ మూవీ సీన్. అందులో ఇంటర్వెల్‌కు ముందు ఈ సీన్ ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఇప్పిటికే ఎన్నో సినిమాల్లో ఆ సీన్‌ను వాడుకున్నారు. ఇలాంటి ఓ సీన్.. దీపికా, రణ్‌వీర్ మధ్య కూడా జరిగినట్టుంది.

హిట్ పెయిర్‌గా నిలిచిన దీప్‌వీర్..
రామ్ లీలా, భాజీరావ్ మస్తానీ, పద్మావత్ చిత్రాలతో హిట్ పెయిర్‌గా నిలిచిన దీపికా, రణ్ వీర్ సింగ్ నిజజీవితంలో ఒక్కటయ్యారు. స్క్రీన్‌పై వీరు పండించిన రొమాన్స్‌కు బాక్సాఫీస్ కూడా షేక్ అయింది. రామ్ లీలా, భాజీరావ్ మస్తాని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయగా.. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన పద్మావత్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

ప్రేమ చిగురించడంతో.. పెళ్లి పీఠలెక్కారు
సినిమాల్లో నటించడంతో వీరి తెర వెనక నిజమైన ప్రేమికులుగా మారారు. వీరి ప్రేమను బయటపెట్టడానికి చాలా సమయమే తీసుకున్నా.. చివరకు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇక దీపికాపై రణ్‌వీర్ చూపించిన ప్రేమకు అప్పుడప్పుడు మీడియా కూడా ఫిదా అవుతూ ఉంటుంది.

ఎన్నో సందర్భాల్లో ప్రేమను వ్యక్తపర్చిన రణ్‌వీర్
ఒకానొక సందర్భంలో దీపిక కిందపడబోతూ ఉంటే.. రణ్ వీర్ పట్టుకోవడం అప్పట్లో తెగ వైరల్ అయింది. మరొక ఫంక్షన్‌లో దీపికాకు సమస్య తలెత్తడటంతో తన చెప్పులను చేతుల్లోకి తీసుకుని పట్టుకుని నడిచాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.
తాజాగా ఓ పిక్ పోస్ట్ చేసిన రణ్ వీర్...
రామ్ లీలా షూటింగ్ సమయంలో రణ్‌వీర్.. దీపికా పక్కన కూర్చొని ఆమె నడుమును చూస్తూ ఉన్నాడు. అయితే అదే పిక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఎలాంటి క్యాప్షన్ అవసరం లేదంటూ కొంటెగా నవ్వాడు. దీనికి సెలబ్రెటీలు సైతం కామెంట్లు పెట్టారు. దీనికి దీపికా కూడా రిప్లై ఇస్తూ.. ఏడేళ్లు గడిచాయి.. అయినా ఏమీ మారలేదని పేర్కొంది.


Click it and Unblock the Notifications











