Don't Miss!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- News చంద్రబాబు పై చర్యలకు ఈసీకి సీఈవో సిఫార్సు..!!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
83 మూవీ ఫస్ట్ లుక్: రణవీర్ సింగ్, టీమ్... వెండితెరపైకి భారతీయులు గర్వించే కథ!
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ త్వరలో '83' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. తన సహ నటులతో కలిసి రణవీర్ కనిపించారు.
'ఈ రోజు నుంచి సరిగ్గా సంవత్సరం'... ఇండియా గ్రేటెస్ట్ స్టోరీని ఏప్రిల్ 10, 2020న విడుదల కాబోతోంది' అంటూ రణవీర్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో రణవీర్‌తో పాటు ఆర్ బాద్రే, హార్డీ సంధు, చిరాగ్ పాటిల్, సాఖిబ్ సలీమ్, పంకజ్ త్రిపాఠి, తాహిర్ బాసిన్, అమ్మీ విర్క్, సాహిల్ ఖట్టర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
83.. వెండి తెరపైకి భారతీయులు గర్వించే కథ
‘83' సినిమా ద్వారా వెండితెకరపైకి భారతీయులు గర్వించే కథను తేబోతున్నారు దర్శకుడు కబీర్ ఖాన్. ఇప్పటి వరకు వచ్చిన అన్ని క్రికెట్ బేస్డ్ సినిమాల కంటే ఇది టాప్ మూవీ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే భారతీయ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండి పోయే ఘట్టం అది.
ధర్మశాలలో ప్రిపరేషన్
1983 టీమిండియా తొలిసారి క్రికెట్ వరల్డ్ కప్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ స్టోరీని బేస్ చేసుకుని ‘83' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం రణవీర్ అండ్ టీమ్ ధర్మశాలలో ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ ట్రైనింగ్ తర్వాత షూటింగ్ మొదలు కానుంది.
రణవీర్ సింగ్, కపిల్ దేవ్
కొన్ని రోజుల క్రితం రణవీర్ ఈ సినిమా కోసం క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ సమక్షంలో ప్రిపేర్ అవుతున్న ఫోటో చేశారు. ‘లజెండ్ కపిల్ దేవ్ 83 సినిమా గురించి నన్ను బ్లెస్ చేశారు. జర్నీ మొదలైంది' అంటూ పేర్కొని ఆయనపై తన అభిమానం చాటుకున్నారు.
రణవీర్ సింగ్
ఇంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ పాత్రలో కనపించడంపై రణవీర్ సింగ్ స్పందిస్తూ... ‘నేను పుట్టిన సమయంలోనే క్రికెట్ మన దేశంలో పాపులర్. దర్శకుడు కబీర్ ఖాన్ నా వద్దకు వచ్చి 83 సినిమా చేద్దామన్నపుడు చాలా సంతోషించాను. కథ అద్భుతంగా ఉంది. ఇది కేవలం క్రికెట్ గురించే కాదు.. ఇదొక హ్యూమన్ స్టోరీ' అని రణవీర్ సింగ్ తెలిపారు.