twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    83 మూవీ ఫస్ట్ లుక్: రణవీర్ సింగ్, టీమ్... వెండితెరపైకి భారతీయులు గర్వించే కథ!

    |

    బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ త్వరలో '83' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. తన సహ నటులతో కలిసి రణవీర్ కనిపించారు.

    'ఈ రోజు నుంచి సరిగ్గా సంవత్సరం'... ఇండియా గ్రేటెస్ట్ స్టోరీని ఏప్రిల్ 10, 2020న విడుదల కాబోతోంది' అంటూ రణవీర్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో రణవీర్‌తో పాటు ఆర్ బాద్రే, హార్డీ సంధు, చిరాగ్ పాటిల్, సాఖిబ్ సలీమ్, పంకజ్ త్రిపాఠి, తాహిర్ బాసిన్, అమ్మీ విర్క్, సాహిల్ ఖట్టర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

    83.. వెండి తెరపైకి భారతీయులు గర్వించే కథ

    83.. వెండి తెరపైకి భారతీయులు గర్వించే కథ

    ‘83' సినిమా ద్వారా వెండితెకరపైకి భారతీయులు గర్వించే కథను తేబోతున్నారు దర్శకుడు కబీర్ ఖాన్. ఇప్పటి వరకు వచ్చిన అన్ని క్రికెట్ బేస్డ్ సినిమాల కంటే ఇది టాప్ మూవీ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే భారతీయ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండి పోయే ఘట్టం అది.

    ధర్మశాలలో ప్రిపరేషన్

    ధర్మశాలలో ప్రిపరేషన్

    1983 టీమిండియా తొలిసారి క్రికెట్ వరల్డ్ కప్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ స్టోరీని బేస్ చేసుకుని ‘83' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం రణవీర్ అండ్ టీమ్ ధర్మశాలలో ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ ట్రైనింగ్ తర్వాత షూటింగ్ మొదలు కానుంది.

    రణవీర్ సింగ్, కపిల్ దేవ్

    రణవీర్ సింగ్, కపిల్ దేవ్

    కొన్ని రోజుల క్రితం రణవీర్ ఈ సినిమా కోసం క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ సమక్షంలో ప్రిపేర్ అవుతున్న ఫోటో చేశారు. ‘లజెండ్ కపిల్ దేవ్ 83 సినిమా గురించి నన్ను బ్లెస్ చేశారు. జర్నీ మొదలైంది' అంటూ పేర్కొని ఆయనపై తన అభిమానం చాటుకున్నారు.

    రణవీర్ సింగ్

    రణవీర్ సింగ్

    ఇంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ పాత్రలో కనపించడంపై రణవీర్ సింగ్ స్పందిస్తూ... ‘నేను పుట్టిన సమయంలోనే క్రికెట్ మన దేశంలో పాపులర్. దర్శకుడు కబీర్ ఖాన్ నా వద్దకు వచ్చి 83 సినిమా చేద్దామన్నపుడు చాలా సంతోషించాను. కథ అద్భుతంగా ఉంది. ఇది కేవలం క్రికెట్ గురించే కాదు.. ఇదొక హ్యూమన్ స్టోరీ' అని రణవీర్ సింగ్ తెలిపారు.

    English summary
    Ranveer Singh shared the first look of his upcoming film 83. In the picture, Ranveer is seen posing with his co-actors.Ranveer captioned the picture saying, "One year from today, relive India's greatest story #Relive83 Releasing on 10th April 2020."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X