బుగ్గ కొరికి చంపేసేంత పని చేశాడు.. రణ్‌వీర్ సింగ్ గురించి కరణ్ జోహర్
కరణ్ జోహర్ చాలా సరదా మనిషి. మనసులో ఏదనిపిస్తే అమాయకంగా ముఖంగా ముందే మాట్లాడేస్తుంటాడు. తాజాగా ఏం జరిగిందో ఏమో గానీ కరణ్ జోహర్‌ను సింహా హీరో, హీరోయిన్లు, దర్శకులు ముద్దుల్లో ముంచెత్తారు. దానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
కరణ్ జోహర్ ప్రస్తుతం టెంపర్ తెలుగు చిత్రం ఆధారంగా సింహా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, సారా అలీఖాన్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

సింహా చిత్ర షూటింగ్‌లో ఎముకల్ని విరిచేంతగా ప్రేమను కురిపించారు అంటే కరణ్ జోహర్ ట్వీట్ చేశారు. కరణ్‌ను రణ్‌వీర్ సింగ్, సారా, రోహిత్ ముద్దులతో ముంచెత్తారు. తనను కౌగిలించుకొని ముద్దులు కురిపించిన వారిని హృదయపూర్వకంగా స్వాగతించారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ నటించిన టెంపర్ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సింహా పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











