రణవీర్-దీపిక వెడ్డింగ్: హల్దీ సెర్మనీ ఫోటోస్ లీక్, కోట్లు ఖరీదు చేసే నగలు!
బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణవీర్ సింగ్-దీపిక పదుకోన్ వివాహం నవంబర్ 14, 15 తేదీల్లో జరుగబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఇటీవలే దీపిక పదుకోన్ కుటుంబం కొంకణి సాంప్రదాయ ప్రకారం నంది పూజతో వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు.
తాజాగా రణవీర్ సింగ్ ఫ్యామిలీ సైతం తమ కుటుంబ సాంప్రదాయం ప్రకారం హల్ది సెర్మనీతో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ ఫోటోల్లో రణవీర్ మొహానికి పసుపు రాసుకుని కనిపించారు.
రణవీర్ సింగ్ హల్ది సెర్మనీ
హల్ది సెర్మనీ అంటే వరుడి దేహానికి పసుపు పూసి నిర్వహించే ఒక సాంప్రదాయ వేడుక.

లేక్ కోమోలో వివాహం
రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ పెళ్లి వేడుకను తమకు నచ్చిన విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఇటలీలోని లేక్ కోమోలో వీరి డెస్టినేషన్ వివాహం జరుగబోతోంది. ఓ వెడ్డింగ్ ప్లానింగ్ ఏజెన్సీ ఈ వేడుకకు సంబంధించిన వ్యవహారాలు ఆర్గనైజ్ చేస్తున్నారు.

కోట్లు ఖదీదు చేసే నగలు
ఈ పెళ్లి వేడుకలో దీపిక పదుకోన్ రూ. 1 కోటికిపైగా విలువ చేసే నగలు ధరించబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం మంగళసూత్రం కోసమే రూ. 20 లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు సమాచారం. పెళ్లి రోజు దీపిక లుక్ ఎలా ఉండబోతోందో అంటూ అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రెండు సాంప్రదాయాల ప్రకారం వివాహం
రెండు సాంప్రదాయాల ప్రకారం దీపిక, రణవీర్ వివాహం జరుగబోతోంది. దీపిక సారస్వత్ బ్రాహ్మిణ్ కమ్యూనిటికి చెందిన అమ్మాయి. ఆమె మాతృభాష కొంకణి. దీంతో నవంబర్ 14న కొంకణి సంప్రదాయం ప్రకారం వివాహం జరుగుతుందని, 15న రణవీర్ సింగ్ కుటుంబ సాంప్రదాయం ప్రకారం సింధి స్టైల్‌లో వివాహం జరుగుతుందని చర్చించుకుంటున్నారు.

ముంబైలో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్
ఇటలీలోన లేక కోమోలో జరిగే పెళ్లి వేడుకకు అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరు కాబోతున్నారు. అయితే డిసెంబర్ 1న ముంబైలో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించబోతున్నారట. ఈ వేడుకకు సినీ రంగానికి చెందిన అందరికీ ఆహ్వానాలు అందాయని తెలుస్తోంది.

ఐదేళ్లు డేటింగ్
2013లో వచ్చిన ‘రామ్ లీలా' సినిమాలో దీపిక, రణవీర్ తొలిసారి కలిసి నటించారు. అలా వీరి పరిచయం ప్రేమగా మారింది. దాదాపు ఐదేళ్లకుపైగా డేటింగ్ చేసిన అనంతరం పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ ఏడాది జరిగే బిగ్గెస్ట్ బాలీవుడ్ వెడ్డింగ్స్‌లో ఇదీ ఒకటిగా నిలుస్తుందని చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











