దీపికపై రణ్‌వీర్ ప్రతీకారం... గృహ నిర్బంధంలో అదను చూసి దెబ్బ కొట్టిన ‘భర్త’

కరోనావైరస్ కారణంగా స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ దంపతులు రొమాంటిక్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరిపై మరోకరు చిలిపిగా సెటైర్లు విసురుకొంటున్నారు. ఓసారి రణ్‌వీర్‌ను దీపిక ఆటపట్టిస్తే.. మరోసారి దీపికను రణ్‌వీర్ ఆటపట్టిస్తూ.. సమయాన్ని సద్వినియోగం చేసుకొంటున్నారు. ఇంట్లో చేసే చిలిపి పనులను తమ ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టి వినోదాన్ని పంచుకొంటున్నారు. తాజాగా సంఘటనపై దీపికపై రణ్‌వీర్ ప్రతీకారం తీర్చుకొన్నారు. అదేలా అంటే..

రణ్‌వీర్‌పై దీపిక ఫిర్యాదు

రణ్‌వీర్‌పై దీపిక ఫిర్యాదు

పెళ్లి తర్వాత పూర్తిస్థాయిలో కలిసి ఉంటున్న ప్రియాంక, రణ్‌వీర్‌లకు కరోనావైరస్ మరింత దగ్గరకు చేర్చింది. లాక్‌డౌన్ పిరియడ్‌లో ఇంటికే పరిమితమైన రణ్‌వీర్‌పై కాస్త ఫిర్యాదు కూడా చేసింది. రోజులో దాదాపు 20 గంటలు నిద్రపోతున్నాడు. కేవలం 4 గంటలే మెలుకువ ఉంటున్నాడు అని చెప్పింది.

పక్కా గృహిణిగా దీపిక

పక్కా గృహిణిగా దీపిక

21 రోజుల లాక్‌డౌన్ కారణంగా దీపికా పదుకోన్ స్వచ్ఛమైన గృహిణిగా మారిపోయింది. ఇంటిలోని వస్తువులను చక్కగా సర్దుకుంటూ కాలాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంటిలోని నిత్యావసర వస్తువుల డబ్బలపై వాటి పేర్లు రాస్తూ లేబుల్స్ అంటిస్తున్నారు. అదే క్రమంలో నిద్రలో ఉన్న రణ్‌వీర్ సింగ్ తలపై భర్త (husband) అనే స్టిక్కర్‌ను అంటించింది.

నా భర్త అంటూ రణ్‌వీర్ తలపై స్టిక్కర్

నా భర్త అంటూ రణ్‌వీర్ తలపై స్టిక్కర్

రణ్‌వీర్ తలపై ఉన్న స్టిక్కర్ ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసి.. కాలాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకొంటున్నారు అంటూ కామెంట్ చేసింది. ఆ ఫోటోకు ఇన్స్‌టాగ్రామ్‌లో విశేష స్పందన వచ్చింది. తన ఫోటోను అలా బహిరంగ పరచడంపై అసంతృప్తి గురైన రణ్‌వీర్ సరైన సమయం కోసం ఎదురు చూశాడు. అర్ధరాత్రి దీపిక దొంగచాటుగా చేసిన పనిని కెమెరాలో బంధించి తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

దొంగచాటుగా దీపిక..

దొంగచాటుగా దీపిక..

దీపిక అర్ధరాత్రి ఖిల్జి అనే న్యూట్రిషన్ ఫుడ్‌ను స్పూన్‌లో తీసుకొని నాకడం చూసి దానిని కెమెరాలో బంధించాడు. చప్పుడు కాకుండా, శబ్దం చేయకుండా దొంగచాటుగా ఇంట్లో అర్ధరాత్రి ఆ పని ఏంటి అంటూ రణ్‌వీర్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఇది నా స్వీట్ రివేంజ్ అంటూ ఆయన పేర్కొన్నాడు.

Recommended Video

If Sunny Leone Stand Next To Trump 10 Million People Welcome Him
83 చిత్రంలో దీపిక, రణ్‌వీర్ సింగ్

83 చిత్రంలో దీపిక, రణ్‌వీర్ సింగ్

కాగా, దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్‌ తమ కెరీర్‌పరంగా చాలా బిజీగా ఉన్నారు. వారిద్దరు కలిసి నటించిన 83 చిత్రం రిలీజ్‌కు సిద్దంగా ఉంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణ్‌వీర్ కపిల్ దేవ్‌గా నటించగా, కపిల్ భార్య రోమిగా దీపిక నటించింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X