8 గంటల షిఫ్ట్ వివాదం.. దీపికాపై రణవీర్ సింగ్ షాకింగ్ కామెంట్స్..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్'బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ సక్సెస్‌గా దూసుకుపోతోంది. కోలీవుడ్ యాంగ్రీ యంగ్ మాన్ మాధవన్, బాలీవుడ్ విలన్ సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, తొలి రోజునుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన కొన్ని రోజులలోనే రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఈ నేపధ్యంలో హీరో రణ్‌వీర్ కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏమన్నారంటే?

'ధురంధర్ పార్ట్ 2'ను అధికారికంగా ప్రకటించడంతో రణ్‌వీర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్‌లో చిత్రబృందం ఈ సినిమాను 'ఇయర్ ఎండ్‌లో బాలీవుడ్‌కు వచ్చిన సర్‌ప్రైజ్ బ్లాక్‌బస్టర్'గా అభివర్ణించింది. గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రణ్‌వీర్ సింగ్‌కు ఈ సినిమా కెరీర్‌లో కీలక మలుపుగా మారిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా, ఈ భారీ విజయం నడుమ రణ్‌వీర్ సింగ్‌కు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Ranveer Singh s Hot Comments on Deepika Padukone s 8-Hour Work Shift Go Viral

ఈ వీడియో ఆయన భార్య, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఇటీవల చేసిన '8 గంటల షిఫ్ట్' డిమాండ్‌కు కౌంటర్‌గా బయటకు తీసి పోస్టు చేయడంతో కొత్త వివాదానికి తెరలేపింది. దీపికా పదుకొనే తల్లి అయిన తర్వాత, పోస్ట్‌పార్టమ్ అవసరాలు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ దృష్ట్యా రోజుకు 8 గంటలు మాత్రమే షూటింగ్ చేస్తానని నిర్మాతలతో చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కొంతమంది సోషల్ మీడియా యూజర్లు తీవ్రంగా విమర్శలు చేయగా, అదే సమయంలో రణ్‌వీర్ సింగ్ 2022లో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్‌ను మళ్లీ వైరల్ చేశారు.

ఆ వీడియోలో రణ్‌వీర్ మాట్లాడుతూ.. 'చాలాసార్లు నా సహనటులు నాపై ఫిర్యాదు చేస్తుంటారు. నేను 8 గంటల షిఫ్ట్ అనుకున్నా, కొన్నిసార్లు 10 నుంచి 12 గంటల వరకూ షూటింగ్ చేస్తాను. దాంతో వాళ్లూ నాతో పాటు ఉండాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ల ఇతర సినిమాల షెడ్యూల్స్‌కు ఇబ్బంది అవుతుంది. కానీ, 8 గంటల్లో షూట్ పూర్తికాకపోతే, కొంచెం ఎక్కువ సేపు పని చేయడంలో తప్పేముంది?'అని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఇంటర్వ్యూ అప్పట్లో సాధారణ వర్కింగ్ అవర్స్ గురించి చేసిన వ్యాఖ్యలేనని, దీపికా డిమాండ్‌తో ఎలాంటి సంబంధం లేదని తర్వాత స్పష్టమైంది.

ఈ పాత క్లిప్‌ను ఎక్స్ ( ట్వీట్టర్) లో షేర్ చేస్తూ '8 గంటల షిఫ్ట్‌తో ఇలాంటి సినిమాలు తీయలేము. నటులు కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే ఇంత కష్టం భరించాలి' అంటూ పోస్టు చేయడం వైరల్ అయింది. 'ముందు ఆదిత్య ధర్, ఇప్పుడు రణ్‌వీర్ దీపికాను ఎక్స్‌పోజ్ చేస్తున్నారు' అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ వివాదంపై ప్రముఖ జర్నలిస్ట్, ఇంటర్వ్యూయర్ ఫరిదూన్ షార్యార్ స్పందిస్తూ, 'ఈ ఇంటర్వ్యూ మూడు సంవత్సరాల క్రితం చేశాను. దీపికా లేదా 'ధురంధర్'తో దీనికి ఎలాంటి సంబంధం లేదు. పాత వీడియోను తప్పుగా వాడుతున్నారు' అంటూ క్లారిటీ ఇచ్చారు.

ఇదే సమయంలో 'ధురంధర్' దర్శకుడు ఆదిత్య ధర్ కూడా ట్రైలర్ లాంచ్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. 'ఈ సినిమా కోసం నటీనటులు, సిబ్బంది 16-18 గంటలు నిరంతరంగా పని చేశారు. ఎవరూ వర్కింగ్ అవర్స్ గురించి ఫిర్యాదు చేయలేదు. పూర్తి అంకితభావంతో పని చేసినప్పుడే స్క్రీన్‌పై ఈ స్థాయి ఫలితం కనిపిస్తుంది' అని ఆయన అన్నారు. రణ్‌వీర్ ప్యాక్-అప్ అయిన తర్వాత కూడా సెట్లో ఉండి అసిస్టెంట్‌లా 3-4 గంటలు పని చేశాడని ప్రశంసించారు. ఇలా మరోసారి వర్కింగ్ అవర్స్ వివాదం చర్చ మీదికి వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X