టెంపర్ రీమేక్ ట్విట్టర్ రివ్యూ: ఎన్టీఆర్ సినిమాని కాపీ పేస్టా.. విషయం ఉందా లేదా!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం 2015లో విడుదలై మంచి ఘనవిజయం సాధించింది. పూరిజగన్నాథ్ డైరెక్షన్ స్టైల్, ఎన్టీఆర్ నటన ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచిన అంశాలు. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించాడు. పోలీస్ పాత్రలో రణవీర్ నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ హీరోయిన్ గా నటిస్తోంది. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా సోషల్ మీడియాలో ఎలాంటి స్పందన ఉందొ చూద్దాం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి.
కాపీ పేస్ట్ చేశారు
సింబా చిత్రం అంచనాలకు తగ్గట్లుగా లేదు. టెంపర్ చిత్రాన్ని కాపీ పేస్ట్ చేశారు. కానీ సారా ఖాన్ అద్భుతంగా నటించింది.
పవర్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్
సింబా చిత్రం పవర్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్. సందేశం కూడా చాలా బావుంది.
మళ్లీ నిరూపించాడు
దర్శకుడు రోహిత్ శెట్టి తానేంటో సింబా చిత్రం ద్వారా మరోమారు నిరూపించాడు. రణవీర్ సింగ్ పెర్ఫామెన్స్ ఈ చిత్రంలో విజిల్ కొట్టించే విధంగా ఉంది.
రోమాలు నిక్కబొడుచుకునేలా
ఈ సింబా చిత్రాన్ని అజయ్ దేవగన్ కోసం చూసా. ఆయన వచ్చే సన్నివేశం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది.
భారీ విజయం ఖాయం
సింబా చిత్రం చాలా బావుంది. బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా సాధిస్తుంది.
కాపీ చేయలేదు
సింబా చిత్రాన్ని కాపీ చేయలేదు. అధికారికంగానే రైట్స్ తీసుకుని టెంపర్ చిత్రాన్ని రీమేక్ చేసారు. కానీ కథ పాడవకుండా కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేసారు.
మసాలా సినిమా
మసాలా సినిమాలే రాజ్యం ఏలుతాయి అని సింబా మరోమారు నిరూపించింది.
ఆల్ రౌండర్
నటుడిగా తాను ఆల్ రౌండర్ అని రణవీర్ సింగ్ మరోమారు నిరూపించుకున్నాడు. సింబా చిత్రానికి అతడి పాత్రే గుండె లాంటిది.
అంతగా బాగాలేదు
సింబా చిత్రం బాగాలేదు. ఒరిజినల్ టెంపర్ స్థాయిని చేరుకునేలా లేదు.
ఫస్ట్ హాఫ్ లో కొత్తదనం లేదు
సింబా ఫస్ట్ హాఫ్ ఆకట్టుకునే విధంగా లేదు. చిత్రంలో కొత్తదనం కరువైంది.


Click it and Unblock the Notifications











