Honey Singh పై కిడ్నాప్, దాడి కేసు.. అరెస్ట్‌కు బాధితుడి డిమాండ్.. అసలేం జరిగిందంటే?
పాపులర్ ర్యాప్ సింగర్ హానీ సింగ్‌పై కిడ్నాప్, దాడి కేసు నమోదైంది. ముంబై ఓ ఈవెంట్ ఆర్గనైజర్‌పై దాికి పాల్పడ్డారనే ఆరోపణలపై బీకేసీ పోలీస్ స్టేషన్‌లో హానీ సింగ్, మరికొందరిపై వివేక్ రామన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. హానీ సింగ్‌పై కేసు నమోదు కావడంతో బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఏప్రిల్ 15వ తేదీన జరిగిన గొడవ నేపథ్యంలో నమోదైన ఈ కేసు వివరాల్లోకి వెళితే..
బీకేపీ పోలీస్ అధికారులు తెలిపిన ప్రకారం.. హానీ సింగ్, మరికొందరిపై ఈవెంట్ కంపెనీ యజమాని వివేక్ రామన్ కిడ్నాప్, దాడి కేసు నమోదు చేశారు. హానీ సింగ్, అతని సహచరులు తనని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ముంబైలోని ఓ హోటల్‌లో బంధించి దాడి చేశారు అని తెలిపారు. ఏప్రిల్ 15వ తేదీన హనీ సింగ్ కోసం ఓ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేశాం. ఆ ఈవెంట్ వద్ద గొడవ జరిగిందని ఏప్రిల్ 19వ తేదీన రామన్ తమకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.

ఈవెంట్ నిర్వాహణక చెల్లించాల్సిన డబ్బు విషయంలో కొంత విభేదాలు తలెత్తాయి. సకాలంలో డబ్బులు ఇవ్వలేదు. దాంతో హానీ సింగ్, అతడి సహచరుల మధ్య గొడవ జరిగింది. దాంతో వివేక్ రామన్‌ను హోటల్‌లో బంధించి దాడి చేశారు. దాంతో హానీ సింగ్‌పై ఫిర్యాదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు పోలీసులు వెల్లడించారు.
హానీ సింగ్ విషయానికి వస్తే.. ఇటీవల ఆయన కాంట్ ఫైండ్ మీ, నాగన్ అనే రెండు పాటలు విడుదల చేశారు. యూట్యూబ్‌లో విడుదలైన ఆ రెండు పాటలకు మంచి ఆదరణ లభించింది. ఆ పాటల నేపథ్యంలో ఇండియా టూర్ చేపట్టేందుకు నిర్ణయం తీసుకొన్నారు. ఆ టూర్‌కు హానీ 3.0 అని పేరు పెట్టారు. ఆహ్మాదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, జైపూర్, రాయ్‌పూర్, ఇతర నగరాల్లో ఈవెంట్లకు ప్లాన్ చేశారు.
ఇదిలా ఉండగా, సల్మాన్ ఖాన్ నటించిన కిసి కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలో హానీ సింగ్ ఓ పాట పాడారు. ఆయన పాడటమే కాకుండా సినిమా కోసం చిత్రీకరించిన పాటలో సల్మాన్ ఖాన్‌తో స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ చిత్రం ఏప్రిల్ 21వ తేదీన రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











