20 ఏళ్ల వయసులో.. 40 ఏళ్ల హీరోపై మోజు.. పబ్లిక్‌గా బయటపడ్డ యవ్వారం

ప్రేమ గుడ్డిది, చెవిటిది, మూగదని కొంతమంది అంటూ అంటూ ఉంటారు. పేద-ధనిక, కులమతాలు, వయపు అంతరాలు ఏవీ ప్రేమకు అడ్డు రావు. ఈ విషయంలో ఎందరి విషయంలోనో నిజమైంది. సినీరంగానికి వస్తే.. తమ తండ్రి వయసు హీరోలను పెళ్లి చేసుకున్న హీరోయిన్లు.. తనకంటే 10, 15 ఏళ్ల చిన్న నటులను చేసుకున్న నటీమణులు ఎందరో ఉన్నారు. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ తనకంటే 20 ఏళ్లు పెద్దవాడైన హీరోపై మనసు పడింది. ఈ వివరాల్లోకి వెళితే..

తల్లికి మించిన అందంతో రషా

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ గారాల కూతురు రషా థడానీ . తల్లికి మించిన అందంతో, ముట్టుకుంటే మాసిపోయే స్కిన్ టోన్‌తో చిన్నతనంలోనే పాపులర్ అయ్యింది రషా. సోషల్ మీడియాలో ఈమె పెట్టే రీల్స్, వీడియోలకు భారీగా ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మకు తొలి నుంచి తనకంటే పెద్ద వాళ్లతో స్నేహం చేయడం ఇష్టం కాబోలు. రషా ఫ్రెండ్స్ సర్కిల్ చూస్తే అది నిజమేనని అనిపిస్తుంది. ముఖ్యంగా మిల్కీబ్యూటీ తమన్నా భాటియాతో ఈమె ఫ్రెండ్‌షిప్ అప్పట్లో వార్తల్లో నిలిచింది.

Rasha Thadani reveals Siddharth Malhotra as her first celebrity crush

ట్రోలింగ్‌కు చెక్ పెట్టిన తమన్నా

మీకంటే 15 ఏళ్లు చిన్నదైన రషాతో మీకు స్నేహం ఏంటీ? అని మీడియా, నెటిజన్లు ప్రశ్నించగా.. తమన్నా తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. రషాను తాను ఓ పార్టీలో కలిశానని మా ఇద్దరి మధ్యా మంచి స్నేహం కుదిరిందని అప్పటి నుంచి మేం చాలా సన్నిహితంగా ఉంటున్నామని తమన్నా తెలిపారు. ఏజ్ గ్యాప్ విషయంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదని మనసుకు నచ్చిన వారితో సంతోషంగా ఉండటంలో తప్పేంటని ఆమె ప్రశ్నించారు.

ఆయనే నా ఫస్ట్ క్రష్

తన మాదిరిగానే కూతురిని కూడా స్టార్ హీరోయిన్‌ని చేయాలని రవీనా టాండన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. తల్లి హీరోయిన్ కావడంతో రషా థడానీ చాలా ఈజీగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవగణ్ మేనల్లుడు అమన్ దేవగణ్‌తో కలిసి ఆజాద్ అనే సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది రషా. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో హిందీ జనాల కన్ను ఈ చిన్నదానిపై పడింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా రషా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సినీ పరిశ్రమలో తన మొదటి క్రష్ .. హీరో సిద్ధార్ మల్హోత్రా అని వేదికపైనే చెప్పి అందరికీ షాకిచ్చింది. ఆయన నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. అప్పట్లో ఈమె వ్యాఖ్యలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

గుడ్‌న్యూస్ చెప్పిన సిద్ధార్ధ్ - కియారా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ భర్తే సిద్ధార్ధ్ మల్హోత్రా. ఈ జంట తాము త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఇటీవల ప్రకటించి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. కియారా అద్వానీ ప్రస్తుతం వార్ 2లో నటిస్తుండగా.. గర్భం దాల్చిన నేపథ్యంలో ఆమె కొన్నాళ్లు బ్రేక్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సిద్ధార్ధ్ విషయానికి వస్తే ఆయన పరమ్ సుందరి అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. ఇటీవల రిలీజైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X