twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెద్ద నిర్మాత అన్నాడు.. రూమ్‌కి పిలిచి అలా చేయబోతే! ఓపెన్‌గా చెప్పేసిన రష్మీ

    |

    సినీ ఇండస్ట్రీతో సంబంధం లేకుండా బయటి నుంచి వచ్చే ప్రతీ అమ్మాయి లైంగిక వేధింపులు ఎదుర్కోవాల్సిందే అంటూ సంచలనం సృష్టించింది నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ రష్మీ దేశాయ్. బడా నిర్మాత సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పి ఓ వ్యక్తి తనను రేప్ చేయాలని ప్రయత్నించాడంటూ ఓపెన్ అయింది రష్మీ. వివరాల్లోకి పోతే..

    సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్

    సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్

    బుల్లితెరపై ప్రసారమయ్యే పలు టీవీ కార్యక్రమాల ద్వారా ఫేమస్ అయింది మాజీ కంటెస్టెంట్ రష్మీ దేశాయ్. ఆ తర్వాత వెండితెరపై కూడా కనిపించిన ఈమె ఇటీవలే ఓ ఆంగ్ల మీడియా సంస్థతో ముచ్చటిస్తూ సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంశంపై స్పందించింది.

     యుక్త ప్రాయంలోనే.. లైంగికంగా లొంగాల్సిందే అంటూ!

    యుక్త ప్రాయంలోనే.. లైంగికంగా లొంగాల్సిందే అంటూ!

    13 ఏళ్ల క్రిందట తాను యుక్త ప్రాయంలోనే ఉండగానే కెరీర్ ఆరంభించానని, అయితే ఆ సమయంలో ఆఫర్స్ పేరుతో సూరజ్ అనే వ్యక్తి తనను వేధించేవాడని చెప్పింది రష్మీ దేశాయ్. సినిమాల్లో ఆఫర్స్ రావాలంటే లైంగికంగా లొంగాల్సిందే అని చెప్పేవాడని, అలా చాలా సార్లు తనకు లోగదీసుకునే ప్రయత్నం చేశాడని ఆమె చెప్పుకొచ్చింది.

    16 ఏళ్ల వయసులో.. ఆఫర్స్ ఇస్తానని ఆశ చూపుతూ

    16 ఏళ్ల వయసులో.. ఆఫర్స్ ఇస్తానని ఆశ చూపుతూ

    16 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చానని, తనకు సినీ ఇండస్ట్రీలో ఎవ్వరూ తెలియదని ఆమె తెలిపింది. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకొని ఆఫర్స్ ఇస్తానని ఆశ చూపుతూ సూరజ్ లైంగికంగా వేధించాడని చెప్పింది. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో బయటి నుంచి వచ్చే అమ్మాయిలకు లైంగిక వేధింపులు తప్పవని ఆమె పేర్కొంది.

    కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి.. రేప్ ప్రయత్నం

    కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి.. రేప్ ప్రయత్నం

    బడా నిర్మాత అయిన యశ్ రాజ్‌తో కలిసి పనిచేసే అవకాశం ఇప్పిస్తానని తన నెంబర్ తీసుకున్న సూరజ్.. ఓసారి ఫోన్ చేసి ఆడిషన్‌కి రమ్మన్నాడని, తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే ఆ రూమ్‌లో అతనొక్కడే ఉన్నాడని చెప్పింది. ఆ సమయంలో ఓ కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపాడని, దాన్ని తాగించి రేప్ చేయాలనే ప్రయత్నం చేశాడని ఆమె తెలిపింది.

    చంపేస్తాను అని అమ్మ వార్నింగ్

    చంపేస్తాను అని అమ్మ వార్నింగ్

    అయితే ఎలాగోలా తప్పించుకున్న తాను, ఆ తర్వాత అమ్మతో చెప్పి అతనికి వార్నింగ్ ఇప్పించానని రష్మీ దేశాయ్ చెప్పింది. ఇంకోసారి నా బిడ్డ జోలికి వస్తే చంపేస్తాను అని అమ్మ వార్నింగ్ ఇచ్చిందని, ఈ పని నేను కూడా చేసి ఉండాల్సింది అని అప్పుడు అనిపించిందని రష్మీ తెలిపింది.

    అందుకే ఈ పాపులారిటీ.. సినీ వర్గాల్లో హాట్ టాపిక్

    అందుకే ఈ పాపులారిటీ.. సినీ వర్గాల్లో హాట్ టాపిక్

    ‘బిగ్ బాస్' షో వల్లనే తనకు కాస్త పాపులారిటీ వచ్చిందని పేర్కొన్న రష్మీ దేశాయ్.. ఎవరైనా పిలిచి అవకాశాలు ఇస్తారేమోనని ఎదురుచూస్తున్నానంటూ తన బాధను వెళ్లగక్కింది. దీంతో ఈ న్యూస్ అటు సోషల్ మీడియాలో, ఇటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

    English summary
    Rashami Desai opend her voice on Costing Couch. In latest interview she commented a person.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X