రష్మిక మందన్న బాలీవుడ్ రచ్చ మొదలైంది.. ఆ స్టార్ హీరోతో కలిసి..
కన్నడ గ్లామరస్ బ్యూటీ రష్మీక మందన్న గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో తన క్రేజ్ ను అమాంతంగా పెంచుకుంటోంది. ఎలాంటి సినిమా చేసినా కూడా అమ్మడికి ఎదో ఒక విధంగా హెల్ప్ అవుతోంది. ఇక ప్రస్తుతం ఆమె ఆశలన్నీ కూడా పుష్ప పైనే ఉన్నాయి. ఆ ఒక్క సినిమా హిట్టయితే బాలీవుడ్ లో కూడా ఆమెకు తిరుగుండదని చెప్పవచ్చు. అయితే అంతకంటే ముందే ఈ బ్యూటీ బాలీవుడ్ లో బడా ఆఫర్స్ అందుకుంటోంది.
ఛలో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా రష్మిక తలరాతే మారిపోయింది. అనంతరం వరుసగా గీతాగోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి సినిమాలతో బాక్సాఫీస్ హిట్స్ అందుకోవడంతో నేషనల్ వైడ్ గా కూడా క్రేజ్ అందుకోంది. దీంతో పుష్ప సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది మాస్ ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.

ఇక ఇటీవల రష్మిక మరొక బాలీవుడ్ సినిమాను స్టార్ట్ చేసింది. సిద్దార్థ్ మల్హోత్రా తో కలిసి మిషన్ మజ్ను సినిమా చేయబోతున్నట్లు ఇదివరకే క్లారిటీ ఇచ్చిన రష్మిక ఫైనక్ గా మళ్ళీ ఆ సినిమా షూటింగ్ తో బిజీ అయినట్లు క్లారిటీ ఇచ్చేసింది. సినిమా లొకేషన్ లో క్లాప్ బోర్డు ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా పోస్ట్ చేసింది. మళ్ళీ వర్క్ తో బిజీ అయినట్లు క్యాప్షన్ కూడా ఇచ్చింది. మరి ఈ సినిమాతో రష్మిక ఏ స్థాయిలో హిట్ అందుకుంటుందో చూడాలి. ఇక ఇటీవల సౌత్ లో అత్యధికంగా సోషల్ మీడియా ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్ గా కూడా రష్మిక నెంబర్ వన్ రికార్డును అందుకుంది. అందుకే ఆమె పై బాలీవుడ్ కూడా ఫోకస్ పెడుతోంది. పుష్ప హిట్టయితే ఆమె రేంజ్ మరో స్థాయికి వెళుతుందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











