కూకటి వేళ్లతో సహా పెకిలించండి.. డ్రగ్స్ కేసుపై రవీనా టండన్ రియాక్షన్

ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఓ వైపు డ్రగ్స్ కేసులో బాలీవుడ్ ఇరుక్కుంటే.. మీటూ ఆరోపణలతో కొట్టు మిట్టాడుతోంది. ఓ వైపు రియా చక్రవర్తి వెల్లడిస్తున్నట్టుగా బయటకు వస్తోన్న లిస్ట్ రచ్చ చేస్తోంది. మరో వైపు దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలు ఇలా బాలీవుడ్ పట్టి కుదిపేస్తున్నాయి., తాజాగా ఈ డ్రగ్స్ కేసులో పెద్ద పెద్ద తారల పేర్లు బయటకు రాడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

రియా అనంతరం..

రియా అనంతరం..

డగ్ర్స్ కేసులో రియా చక్రవర్తి అరెస్ట్ అనంతరం కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. మెయిన్ ట్రాక్ అయిన సుశాంత్ కేసు సైడ్ ట్రాక్ అయింది. ప్రస్తుతం అంతా డ్రగ్స్ కేసుపైనే ఫోకస్ పెడుతున్నారు. ఇందులో బయటకు వస్తోన్న పేర్లు అందర్నీ షాక్‌కు గురి చేస్తున్నాయి.

రకుల్, సారా..

రకుల్, సారా..

మొన్నటి వరకు రియా చక్రవర్తి విచారణలో భాంగా సారా అలీ ఖాన్‌, రకుల్ ప్రీత్ పేర్లను చెప్పిందని వార్తలు వచ్చాయి. ఇక అది నిజమోనేమో అనుకుని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్ముదులిపారు. అయితే అలాంటిదేమీ లేదని రియా పేర్లు చెప్పలేదని ఎన్‌సీబీ అధికారులు తేల్చేశారు. ఆ క్రమంలో శ్రద్దా కపూర్ పేరు కూడా వినిపించింది.

డీకే చాట్ వైరల్..

డీకే చాట్ వైరల్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో డీ(దీపికా పదుకొణె), కే (కరిష్మా) పేరిట జరిగిన వాట్సప్ సంభాషణ వైరల్ అవుతోంది. మాస్ ఉందా? దీపికా అడగటం.. ఉంది కానీ ప్రస్తుతం నేను బయట ఉన్నాను అంటూ కరిష్మా రిప్లై ఇవ్వడం అన్నీ క్లియర్‌గా లీకయ్యాయి. ఇక ఈ కేసులో తదుపరి విచారణకు హాజరు కావాల్సిందిగా కరిష్మకు నోటిసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.

Recommended Video

Sushant Singh Rajput సూసైడ్ కి Bollywood Lady Gangs నే కారణం ! Raveena Tandon
కూకటివేళ్లతో సహా..

కూకటివేళ్లతో సహా..

డ్రగ్స్ కేసుపై రవీనా టండన్ ట్వీట్ చేస్తూ.. ‘మొత్తం క్లీన్ చేయాల్సిన టైం వచ్చింది.. దీన్ని స్వాగతించాల్సిన విషయం.. ఇది మన భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుంది.. ఇక్కడి నుంచే మొదలుపెట్టండి.. డ్రగ్స్ భూతాన్ని కూకటివేళ్లతో పెకలించేయండి.. డ్రగ్స్ వాడినవారిని, అమ్మిన వారిని, డీలర్స్‌ని అందరినీ శిక్షించండి.. దీనివల్ల లాభపడ్డ పెద్ద వారిని కూడా వదలకండి' అని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X