నిర్మాతలతో రాజీ పడలేదు.. హీరోలతో నో అఫైర్.. కరణ్ జోహర్ కోట్లు పెట్టి.. రవీనా సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ హీరోలపై హీరోయిన్ రవీనా టాండన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తమ చెంచా జర్నలిస్టులతో కలిసి విపరీతంగా వేధించారని ఆరోపణలు చేశారు. తనను ఫినిష్ చేయాలని కుట్ర పన్నారు అంటూ రవీనా తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. సుశాంత్ సింగ్, దిశా సలియాన్ మరణాల నేపథ్యంలో బాలీవుడ్ పాలిటిక్స్‌పై రవీనా సంచలన ఆరోపణలు చేయడం మరింత చర్చకు దారి తీశాయి. రవీనా తాజా ఇంటర్వ్యూలో..

కోట్లు పెట్టి చెత్త సినిమా తీస్తారా?

కోట్లు పెట్టి చెత్త సినిమా తీస్తారా?

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై దర్శకుడు కరణ్ జోహర్ చేసిన పోస్టును రవీనా తప్పుపట్టారు. ఎవరైనా కోట్ల రూపాయలు యాక్టర్‌కు చెల్లించి ఓ చెత్త సినిమా తీస్తారా? ప్రతీ నిర్మాత డబ్బు సంపాదించానికే సినిమాలపై పెట్టుబడి పెడుతారనే విషయం తెలియదా? సుశాంత్‌తో తాను నిర్మించిన సినిమాను ఎందుకు రిలీజ్ చేయకుండా చేసిన ప్రయత్నాలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి అని రవీనా అన్నారు.

చెంచా జర్నలిస్టులతో కలిసి

చెంచా జర్నలిస్టులతో కలిసి


బాలీవుడ్‌లో పాలిటిక్స్ ఊహించలేం. నా కెరీర్‌ ఉన్నతంగా ఉన్నప్పుడు నాకు వ్యతిరేకంగా పలువురు హీరోలు తమ చెంచా జర్నలిస్టులతో కలిసి చాలా చెత్త ఆర్టికల్స్ రాయించారు. ఆ హీరోల కోరికలు తీర్చనందుకే వారు అలా చేశారు. అలాంటి చేష్టలను ధైర్యంగా ఎదుర్కొన్నాను అని రవీనా టాండన్ చెప్పారు. సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ క్యాంపుల చేసే దారుణాలను రవీనా ట్వీట్ చేసి వెల్లడించారు.

కెరీర్ కోసం నిర్మాతలతో ఆఫైర్ పెట్టుకోలేదు

కెరీర్ కోసం నిర్మాతలతో ఆఫైర్ పెట్టుకోలేదు

ఇండస్ట్రీలో నా వెనుక గాడ్‌ఫాదర్లు లేరు. నేను ఎలాంటి క్యాంపుల్లో చేరలేదు. నన్ను ఏ హీరో కూడా ప్రమోట్ చేయలేదు. రోల్స్ కోసం నేను హీరోల వద్ద పడుకోలేదు. కెరీర్ కోసం నేను హీరోలతో, నిర్మాతలతో అఫైర్ పెట్టుకోలేదు. అందుకే నా కెరీర్‌ను చేజారకుండా జాగ్రత్తల పడ్డాను అని రవీనా టాండన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హీరోల కోరికలను నిరాకరించా

హీరోల కోరికలను నిరాకరించా

నా కెరీర్ మొత్తంలో చాలా సార్లు హీరోలను ఎలాంటి మొహమాటం లేకుండా వ్యతిరేకించాను. వాళ్లు చెప్పినట్టు నన్ను ఆడించేందుకు ప్రయత్నిస్తే ముఖం మీదే నవ్వేసి ఆగ్రహం వ్యక్తం చేశాను. నేను ఆగ్రహిస్తే బుజ్జగించేందుకు నాతో కలిసి కూర్చొని కబుర్లు చెప్పి శాంత పరిచేవారు అని రవీనా టాండన్ తెలిపారు.

Recommended Video

Sushant Singh Rajput సూసైడ్ కి Bollywood Lady Gangs నే కారణం ! Raveena Tandon
బాలీవుడ్‌లో పిల్ల రాజకీయాలు

బాలీవుడ్‌లో పిల్ల రాజకీయాలు

బాలీవుడ్‌లో చిన్న పిల్లల కంటే దారుణంగా రాజకీయాలు చేస్తారు. స్కూల్ లెవెల్‌లో కూడా అలాంటి పాలిటిక్స్ ఉండవు. చాలా దారుణంగా రాజకీయాలు చేస్తారు. నా ఆఫర్లను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. చాలాసార్లు కొందరు హీరోయిన్లు, హీరోల ప్రియురాళ్లు నన్ను పలు సినిమాల నుంచి తొలగించారు అని రవీనా టాండన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X