మీ మొగుళ్ళు హీరోయిన్ల జీవితాలు నాశనం చేస్తున్నారు.. స్టార్ హీరోని టార్గెట్ చేసిన హీరోయిన్!

బాలీవుడ్ అందాల తార రవీనా టాండన్ మరోమారు వార్తల్లో నిలిచింది. 90 దశకంలో రవీనా తన అందాలతో యువతని మంత్ర ముగ్దుల్ని చేసింది. అప్పట్లో రవీనా టాండన్ ఒక మెరుపు తీగ. ప్రస్తుతం బాలీవుడ్ లో నానా పాటేకర్ రాసలీలలు, తనుశ్రీ దత్త సంచలన కామెంట్స్ గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో తలదూర్చిన రవీనా టాండన్.. తనుశ్రీ దత్తకు మద్దత్తు తెలుపుతూ చేస్తున్న ట్వీట్స్ మరింత సంచలనంగా మారాయి.

 వేధింపులు భరించలేక

వేధింపులు భరించలేక

2009 లో విడుదలైన హార్న్ ఒకే ప్లీజ్ చిత్రం నుంచి అర్థాంతరంగా తనుశ్రీ దత్త తప్పుదుకుంది. దిగ్గజ నటుడు నానా పాటేకర్ లైంగిక వేధింపులు భరించలేకే ఆ చిత్రం నుంచి తాను తప్పుకున్నానని ఇటీవల తనుశ్రీ దత్త సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి.

 పెరుగుతున్న మద్దత్తు

పెరుగుతున్న మద్దత్తు

తనుశ్రీ దత్త లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా వెల్లడించడంతో ఆమెకు బాలీవుడ్ ప్రముఖుల నుంచి మద్దత్తు పెరుగుతోంది. ప్రియాంక చోప్రా మొదలుకుని స్వర భాస్కర్, రిచా చద్దా, సోనమ్ కపూర్ వంటి ప్రముఖుల హీరోయిన్లంతా తనుశ్రీ దత్తకు మద్దత్తు ప్రకటిస్తున్నారు. ఆ జాబితాలోకి 90వ దశకం సంచలనం రవీనా టాండన్ కూడా చేరింది.

హీట్ పెంచుతున్న ట్వీట్స్

హీట్ పెంచుతున్న ట్వీట్స్

రవీనా టాండన్ తనుశ్రీ దత్తకు మద్దత్తు తెలుపుతూ చేస్తున్న ట్వీట్స్ హాట్ టాపిక్ గా మారాయి. పేరు ప్రస్తావించకుండా ఆమె బాలీవుడ్ లోని స్టార్ హీరోల భార్యలందరిని ఏకి పారేస్తోంది. ఓ స్టార్ హీరో, అతడి భార్యపై పరోక్షంగా చేస్తున్న కామెంట్స్ గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది.

మీ మొగుళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా

మీ మొగుళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా

రవీనా టాండన్ చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది. వర్క్ ప్రదేశంలో లైంగికంగా వేధించడం దేనికి సంకేతం. ఈ విషయం గురించి స్టార్ హీరోల భార్యలకు, ప్రియురాళ్లకు బాగా తెలుసు. అయినా కూడా సైలెంట్ గా ఉంటున్నారు. కొంతమంది భార్యలే తమ భర్తలని ఈ రకమైన పనులకు ప్రేరేపిస్తున్నారంటూ రవీనా టాండన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.

మాజీ ప్రియుడి గురించేనా

రవీనా టాండన్ చేసిన ఈ ట్వీట్ గురించి బాలీవుడ్ వర్గాల్లో, అభిమానుల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా గురించి రవీనా టాండన్ పరోక్షంగా ప్రస్తావించిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 90 దశకంలో రవీనా, అక్షయ్ కుమార్ మోస్ట్ రొమాంటిక్ జోడి. వీరి మధ్య ఘాటైన ప్రేమాయణం కూడా సాగింది.

పెళ్ళికి సిద్దమై

పెళ్ళికి సిద్దమై

రవీనా, అక్షయ్ కుమార్ పెళ్ళికి సిద్ధం అవుతున్నారంటూ కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అనుకోకుండా అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నాని వివాహం చేసుకున్నాడు. ఆ వేదనతోనే రవీనా ప్రస్తుతం అక్షయ్ కుమార్ ని టార్గెట్ చేస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ఆధారాలు లేవు

బాలీవుడ్ లో హీరోయిన్లని వేధిస్తున్న నటుల గురించి ఎలాంటి ఆధారాలు లేవు. నేను కూడా నానా పాటేకర్ తో కలసి నటించాను. కానీ నాకెప్పుడూ ఇలాంటి సంఘటన ఎదురు కాలేదు. తనుశ్రీ దత్త ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడుతుంటే.. మద్దత్తు తెలపక పోవడం, సైలెంట్ గా ఉండడం మంచిది కాదని రవీనా అభిప్రాయపడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X