‘రేసుగుర్రం’ విలన్ కూతురు హీరోయిన్‌గా ఎంట్రీ
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ' రేసు గుర్రం' చిత్రంలో మద్దాలి శివారెడ్డి అనే విలన్ పాత్రలో భోజ్‌పురి నటుడు రవి కిషన్ పెర్ఫార్మెన్స్ ఆ సినిమాకే హైలెట్ అయింది. ఆ తర్వాత రవి కిషన్ పలు దక్షిణాది చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్లారు.
కాగా.. రవికిషన్ కూతురు రివ త్వరలో సినీ పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. బాలీవుడ్ చిత్రం ద్వారా ఆమె తన సినిమా కెరీర్ మొదలు పెట్టబోతున్నారు. రివ నటించబోయే తొలి సినిమా వివరాలు తాజాగా బయటకు వచ్చాయి.

బాలీవుడ్ నటి పద్మినీ కోల్హాపురి కుమారుడు ప్రియాంక్‌ను హీరోగా పరిచయం చేస్తూ త్వరలో ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రంలో ప్రియాంక్ సరసన రివ నటించబోతోంది. ఈ చిత్రానికి కరణ్ కశ్యప్ దర్శకత్వం వహించబోతున్నారు.
తన కూతురు రివ తెరంగ్రేటంపై రవి కిషన్ మాట్లాడుతూ... మంచి స్క్రిప్టు దొరికింది. ఇలాంటి కథ దొరకడం ఊహించని బహుమతి. రెండు వారాలుగా ప్రియాంక్, రివ వర్క్ షాపుకు అటెండ్ అవుతున్నారు. నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారనే నమ్మకం ఉంది అన్నారు.


Click it and Unblock the Notifications











