కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష ఖరారు కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గురువారం జోధ్ పూర్ న్యాయస్థానము సల్మాన్ ఖాన్ కు కృష్ణ జింకల వేట కేసులో 5 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ 1998 లో రాజస్థాన్ లో కృష్ణ జింకలని వేటాడినట్లు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. గత 20 ఏళ్లుగా ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. ఎట్టకేలకు జోధ్ పూర్ న్యాయస్థానం గురువారం శిక్ష ఖరారు చేసింది.
బాలీవుడ్ ప్రముఖులంతా సల్మాన్ కుటుంబానికి సానుభూతి వ్యక్తపరుస్తున్నారు. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా సల్మాన్ కు జైలు శిక్ష పడడంపై ట్విట్టర్ లో స్పందించాడు. తన స్నేహితుడు సల్మాన్ జైలు పాలు కావడం బాధించే అంశం అని షోయబ్ అక్తర్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. కానీ తనకు భారత న్యాయస్థానాల పట్ల గౌరవం ఉందని తెలిపాడు.
ఈ విషయాన్ని జీర్ణించుకోవడం సల్మాన్ కుటుంబానికి, అభిమానులకు చాలా కష్టం. త్వరలోనే సల్మాన్ జైలునుంచి బయటకు వస్తాడనే విశ్వాసాన్ని అక్తర్ వ్యక్తపరిచారు.బాలీవుడ్ తారలు చాలా మంది పాక్ ప్రముఖులతో సన్నిహితంగా మెలుగుతారు.అదేవిధంగా షోయబ్ అక్తర్, సల్మాన్ మధ్య కూడా స్నేహం ఉంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి | Subscribe to Telugu Filmibeat.