ధురంధర్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. ఆ తప్పు చేసిన నటుడు ఎవరో తెలుసా?

భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత క్రేజీగా మారిన చిత్రం ధురంధర్ ది రివెంజ్. ఈ సినిమా కోసం దేశంలోని అన్ని ప్రాంతాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 19న రిలీజ్ అవుతున్న ఈ సినిమా విడుదలకు ముందే అనేక రికార్డులు క్రియేట్ చేస్తున్నది. దాంతో ఈ పాపులర్ సినిమాపైనే అందరి దృష్టి పడింది. అయితే ఈ సినిమాలో నటించమని వచ్చిన ఆఫర్‌ను తిరస్కరించిన ఓ హీరో ప్రస్తుతం పశ్చాత్తాపం చెందుతున్నారు. ఈ సినిమాలో నటించి ఉంటే బాగుండేదని ఆయన ఫీల్ అవుతున్నారు. ఆ స్టార్ హీరో ఈ సినిమా గురించి ఏం చెప్పారంటే..

రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన చిత్రం ధురంధర్ ది రివెంజ్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం స్టార్ హీరో అనిల్ కపూర్‌ను దర్శకుడు ఆదిత్య ధార్ సంప్రదించారు. భారీ ఆఫర్‌తో మంచి పాత్రను ఆఫర్ చేశారు అని అనిల్ కపూర్ తెలిపారు.

Anil Kapoor missed Dhurandhar 2

కానీ ధురంధర్ 2 సినిమా ఆఫర్ వచ్చిన సమయంలో తాను ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను. ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్ వల్ల తాను డేట్స్ కేటాయించలేకపోయాను. వారు అడిగిన డేట్స్‌ను నేను ఇవ్వలేకపోయాను. దాంతో ఆ సినిమా చేయలేనని నేను చేతులెత్తేశాను. అలాంటి బంగారం లాంటి ఆఫర్‌ను వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ సినిమాను నేను చేసి ఉంటే బాగుండేదని చాలాసార్లు అనుకొన్నాను అని అనిల్ కపూర్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.

ధురంధర్ 2 చిత్రం చాలా మంచి సినిమా. ఈ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో ఏర్పడిన బజ్ చూస్తే క్రేజీగా ఉంది. ఈ సినిమాలో నటించకపోవడం నాకు నిజంగా నష్టమే. కానీ ఏది రాసి పెట్టి ఉంటే అది జరుగుతుంది. ఏం చేయాలో అది మనకు రాసి పెట్టి ఉండాలి. అయినా అదిత్య ధార్‌కు మంచి విజయం దక్కడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Anil Kapoor missed Dhurandhar 2

అనిల్ కపూర్ విషయానికి వస్తే.. 70 ఏళ్ల వయసులో కూడా నటుడిగా యాక్టివ్‌గా ఉంటూ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకొంటున్నారు. ఇటీవల ఆయన నటించిన సుబేదార్ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. ఈ సినిమాపై క్రిటిక్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో కుష్బూ, రాధిక మదన్, ఆదిత్య రావల్, మోనాసింగ్, సౌరభ్ శుక్లా తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X