»   » సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా.. ఆ భయంతోనే!

సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా.. ఆ భయంతోనే!

Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ లో తిరుగులేని మాస్ ఇమేజ్.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు.. కండలు తిరిగిన వీరులు ఎంత మంది ఉన్నా అతడు మాత్రమే కండల వీరుడు.. ఐదు పదుల వయసులో కూడా మోస్ట్ వాంటెడ్ బ్యాచులర్.. ఈ ఉపోద్ఘాతం మొత్తం సల్మాన్ ఖాన్ గురించే. సల్మాన్ ఖాన్ ఎంత స్టార్ డమ్ అనుభవిస్తునాడో అదే స్థాయిలో ఇబ్బందులు కూడా ఉన్నాయి. హిట్ అండ్ రన్ కేసు మరియు కృష్ణ జింకల వేట కేసు.. దశాబ్దాల కాలంగా సల్లూ భాయ్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

1998 లో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలని వేటాడినట్లు కేసు నమోదైంది. తాజగా జోధ్ పూర్ న్యాయస్థానం ఈ కేసులో తీర్పు వెల్లడించింది. సల్మాన్ ఖాన్ ని దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు కండల వీరుడికి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. సల్మాన్ ఖాన్ పై హిట్ అండ్ రన్ కేసు కూడా ఉన్న సంగతి తెలిసిందే. జోధ్ పూర్ న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో సల్మాన్ ఖాన్ పెళ్లి విషయం మరో మారు చర్చనీయాంశంగా మారింది.

Reason behind Salman Khan still bachelor

మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ? ఈ ప్రశ్న సల్లూ భాయ్ కి మీడియా నుంచి కొన్ని వందల సార్లు ఎదురై ఉంటుంది. కానీ ఎప్పుడు స్పష్టమైన సమాధానం లభించలేదు. ఐదు పదుల వయసు దాటినా సల్లూ భాయ్ వివాహం చేసుకోకపోవడానికి కారణం ఉందంటూ చర్చ జరుగుతోంది. సల్మాన్ ఖాన్ పై ఉన్నా హిట్ అండ్ రన్ కేసు మరియు కృష్ణ జింకల వేట కేసు చాలా తీవ్రమైనవి. వన్య ప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఈ తరహా అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి కనీసం నాలుగేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తనపై ఉన్నా కేసుల భయంతోనే సల్మాన్ ఖాన్ ఇన్నిరోజులు వివాహం చేసుకోలేదని చర్చ జరుగుతోంది. కేసుల నుంచి బయట పడ్డాక వివాహం చేసుకోవాలని సల్లూభాయ్ భావించి ఉండవచ్చు. సల్లూ భాయ్ పై నమోదైన కేసుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో చిక్కులు తప్పడం లేదు.

English summary
Reason behind Salman Khan still bachelor. Salman Khan convicted in black buck poaching case
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X