మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య.. 6 అంతస్తుల భవనంపై నుంచి దూకి.. కారణం అదే అంటూ

గబ్బర్ సింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన బాలీవుడ్ నటి మలైకా అరోరా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. దీంతో ఇటీవల కాలంలో మలైకా అన్నీ చేదు అనుభవాలనే ఎదురువుతున్నాయనే అభిప్రాయం, సానుభూతి ఆమె అభిమానుల్లో వ్యక్తమవుతున్నది. ఆమె తండ్రి మరణం వెనుక వివరాల్లోకి వెళితే..

మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే మానసిక రుగ్మత, డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆయన వైద్య నిపుణుల ద్వారా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన సూసైడ్ చేసుకొన్నారనే వార్త బాలీవుడ్ వర్గాల తీవ్ర సంచలనం రేపింది.

Reason behind the Malaika Arora father Anil Arora Suicide Here is facts

బాంద్రా పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. అనిల్ అరోరా ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలిసింది. ఆయన మానసిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని చెప్పారు. ఆయన తాను నివాసం ఉండే భవనంలోని ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆయన వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు అని అన్నారు. ఈ మరణాన్ని సూసైడ్‌గా పేర్కొంటూ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బాంద్రా కేసు నమోదు చేశారు.

తాజాగా మలైకా అరోరా భావోద్వేగంతో ఓ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ స్టోరీ పోస్టు చేశారు. మీ హృదయంలో అలాంటి వాళ్లకు చోటు ఇవ్వకండి అంటూ పోస్టులో పేర్కొన్నారు. ఆమె ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారనే సందేహాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దుర్వార్త వినడం చర్చనీయాంశమవుతున్నది.

ఇదిలా ఉండగా, గత ఆరేళ్లుగా డేటింగ్ చేస్తున్న బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌తో బ్రేకప్ అయిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇలాంటి బ్రేకప్ విషాదంలో తండ్రి మరణం మరింత కుంగదీసేలా చేసిందనే మలైకా స్నేహితులు, సన్నిహితులు పేర్కొన్నారు.

More from Filmibeat

Read more about: malaika arora anil arora mumbai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X