Poonam Pandey Death: పూనమ్ పాండే మరణానికి అసలైన కారణం అదే..!
బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే గురించి దేశ ప్రజలందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సినీ ప్రియులు ఎంతగానే మెచ్చే ఈ ముద్దుగుమ్మ శుక్రవారం రోజు చనిపోయింది. ప్రస్తుతం 32 ఏళ్ల వయసు కల్గిన ఈ హాట్ బ్యూటీ.. ఎవరూ ఊహంచని విధంగా ఈ రోజు ప్రాణాలు కోల్పోయింది. ఇంత చిన్న వయసులోనే... అద్భుతమైన ఫేమ్ సంపాధించుకున్న ఈ అందగత్తె చావుకు అసలు కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మోడలింగ్ చేస్తూనే తన అందంతో అనేక మంది అభిమానుల్ని సంపాధించుకుంది. ఆతర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టిన తన అభినయంతో మరింత క్రేజ్ తెచ్చుకుంది. అందం, అభినయం కంటే కూడా తన వ్యవహార శైలితో ప్రతిరోజూ వార్తల్లో నిలిచి సెన్సషన్ క్రియేట్ చేసింది. ఇలా అతి తక్కువ సమయంలోనే అందరికీ తెలిసిపోయిందీ అమ్మడు. ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్లుగా ఆస్తులు సంపాధించుకున్న ఈ భామ.. శుక్రవారం రోజు చనిపోయినట్లు పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఇలా ఆమె మరణ వార్త అందరికీ తెలియగా.. చాలా మంది షాక్ కు గురయ్యారు. ఇంత తక్కువ వయసులోనే ఇలా సడెన్ గా చనిపోవడం ఏంటని చాలా మంది నెట్టింటి వేధికగానే ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే పూనమ్ పాండే మృతికి అసలు కారణం ఏంటి, ఆమె ఎందుకు ఇలా సడెన్ గా చనిపోయింది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ కారణంగా చనిపోయినట్లు సమాచారం. అసలు గర్భాశయ క్యాన్సర్ అంటే ఏంటంటే.. గర్భాశయంలోని కణాలు అసాధారణ స్థాయిలో పెరిగి చుట్టుపక్కల కణజాలంతో పాటు అవయవాలను ప్రభావితం చేస్తుంది. ఇలా చేయడం వల్ల గర్భాశయ క్యాన్సర్ వస్తుంది. అయితే ఇది ఎక్కువవడానికి చాలా సమయం పడుతున్నప్పటికీ.. ఈ వ్యాధి సోకినట్లు గుర్తించడమే చాలా ఆలస్యం అవుతుంది. అలా తెలియక చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. అసలు ఈ వ్యాధి సోకినట్లు కూడా చాలా మంది రోగులకు తెలియదు.

అలాగే ఈ గర్భాశయంలో ఏర్పడిన క్యాన్సర్ కణాలు.. శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాప్తిస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రాశయం, యోని వంటి ఇతర భాగాలకు కూడా చేరడంతో వ్యాధి తీవ్రత ఎక్కువ త్వరగా ప్రాణాలు కోల్పోతారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే విషయంలో కూడా ఇదే జరిగింది. అందుకే సడెన్ గా ప్రాణాలు కోల్పోయింది. ఈ గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ముందుకా ఓ వ్యాక్సిన్ వేయించుకుంటే వీలు కూడా ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ కు కారణం అ్యే హెచ్పీవీ వైరస్ సోకకుండా వ్యాక్సిన్ తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.


Click it and Unblock the Notifications











