‘భర్త సూసైడ్ పీడకల.. అందుకే నా లైఫ్‌లో మరొకరికి చోటు లేదు’

దక్షిణాది అమ్మాయిగా హిందీ సినిమా పరిశ్రమలో ప్రవేశించి బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిన ప్రముఖ నటి రేఖ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అఫైర్లు, బ్రేకప్స్,పెళ్లి, ఒంటరితనం ఆమె జీవితాన్ని కుదిపేసినప్పటికీ.. చెక్కుచెదరకుండా నిలబడి.. లైఫ్‌లో ముందుకు నడుస్తున్నది.తన గురించి ఏం మాట్లాడుకొన్నా పట్టించుకోకుండా తనదైన రీతిలో జీవితాన్ని ఆస్వాదిస్తున్నది. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఆ ట్రెండి వీడియోలో ఆమె పంచుకొన్న విషయాలు, వ్యక్తిగత వివరాల్లోకి వెళితే..

మద్రాసీ అమ్మాయిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అందాల భామ రేఖ తన గ్లామర్, నృత్యాలు, అభినయంతో ప్రేక్షకులను చిత్తు చేశారు. అనతికాలంలోనే ఆమెతో కలిసి నటించడానికి బడా హీరోలందరూ క్యూకట్టారు. తక్కువ సమయంలోనే ఆమె పాపులారిటీ భారీగా పెరిగిపోయింది. యాంగ్రీ యంగ్ మ్యాన్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్లు కావడంతో వారిద్దరి పెయిర్ సూపర్ హిట్ అయింది.

Rekha throwback moments of Husband Mukesh death and her love stories

వెండితెర మీద అమితాబ్, రేఖ కాంబినేషన్‌కు విశేషమైన ఆదరణ లభించింది. వాస్తవ జీవితంలో కూడా వారిద్దరి మధ్య ఒకరిపై మరొకరికి ఉన్న ఆకర్షణ.. ప్రేమగా మారింది. ఆ సమయంలో వారిద్దరి లవ్ స్టోరీ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరి గాఢంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవడాన్ని ఎవరూ ఆపలేరని అందరూ అనుకొన్నారు. కానీ అనూహ్యంగా వారిద్దరి ప్రేమ కథకు తెర దించేశాడు.

అమితాబ్‌తో తన బ్రేకప్ తర్వాత రేఖ లైఫ్ చాలా కష్టతరంగా మారింది. ఆమెను ఓదార్చే వారు కూడా కష్టమైపోయారు. అలాంటి సమయంలో తనకుతానే ఒంటరిగా శక్తిని కూడగట్టుకొని మళ్లీ నటిగా తన సత్తాను చాటింది. ఆ తర్వాత కొందరు హీరోలతో అఫైర్ వార్తలు వచ్చాయి. కానీ అవి కేవలం రూమర్లుగానే మిగిలిపోయాయి.

రేఖ బీజీ లైఫ్, ఒంటరితనంలోకి పారిశ్రామిక వేత్త ముఖేష్ ప్రవేశించాడు. తాను ఉన్నానంటూ అండగా నిలిచారు. అయితే వారిద్దరి పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహాన్ని చేసుకొన్నారు. దాంతో రేఖ జీవితం హ్యాపీ లైఫ్‌గా మారిందని అనుకొనే సమయంలో మళ్లీ భారీ కుదుపుకు లోనైంది. ముఖేష్ ఆత్మహత్య చేసుకొన్నారనే విషయం మళ్లీ విషాదంలోకి నెట్టింది.

అయితే ఆ క్షణాల గురించి రేఖ మాట్లాడుతూ.. ముఖేష్‌తో నాది ప్రేమ వివాహమే కానీ.. పెద్దలు కుదిర్చితే పెళ్లిా జరిగింది. పెళ్లికి ముందు ఒకసారి మాత్రమే ఆయన్ని కలిశాను. అప్పుడే ప్రేమ మొదలైంది. దాదాపు అపరిచిత వ్యక్తినే నేను పెళ్లాడాను అని రేఖ చెప్పింది. అయినప్పటికీ మా మధ్య ప్రేమకు ఎలాంటి కొదవ లేకుండా పోయింది అని రేఖ చెప్పారు.

అయితే సవ్యంగా సాగుతున్న నా జీవితంలో ముఖేష్ సూసైడ్ భయంకరమైన క్షణాలు. ఆయన మరణ వార్త తప్పని చెబితే బాగుండు. నా జీవితంలోనే ఇలా ఎందుకు జరుగుతున్నది. నాకే ఎందుకు జరిగింది అనే బాధ, విషాదం నన్నుచుట్టు ముట్టింది. ఆయన మరణం తర్వాత బాధతోపాటు కోపం కూడా నన్ను కుదిపేసింది. ముఖేష్ ను పెళ్లి చేసుకోవడం రిస్కే. కానీ లైఫే మొత్తం రిస్క్. దాని గురించి ఆలోచించలేం అని రేఖ అన్నారు. ముఖేష్ మరణం తర్వాత నేను ఓ నిర్వేదంలోకి వెళ్లాను. ప్రేమ, పెళ్లి నాకు సరిపడవేమో అని అనుకొన్నాను. అందుకే మళ్లీ మరో వ్యక్తికి నా జీవితంలో అవకాశం లేదని భావించి ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తున్నాను అని అన్నారు.

More from Filmibeat

Read more about: rekha mukesh amitabh bachchan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X