దర్శకుడు ఇంతియాజ్ అలీతో చేతులు కలిపిన రిల‌య‌న్స్ ఎంట‌ర్టైన్‌మెంట్స్

By Bojja Kumar

అనిల్ అంబానీకి చెందిన రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సంస్థ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ భాగస్వామిగా మరో ప్రొడ‌క్ష‌న్ కంపెనీ స్థాపించింది. హిందీ, మ‌రాఠీ, త‌మిళ్‌, తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, బెంగాలీలో దాదాపు 300ల‌కి పైగా సినిమాల‌ను నిర్మించి రిల‌య‌న్స్ సంస్థ ఇంతియాజ్ అలీతో కలిపి 50:50 జాయింట్ వెంచ‌ర్‌గా ప్ర‌తిష్టాత్మ‌కంగా విండో సీట్ ఫిల్మ్స్, ఎల్‌ఎల్‌పిని మొద‌లుపెట్టింది. రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కు సంబంధించి ఐదో సృజ‌నాత్మ‌క భాగ‌స్వామ్య మూవీ ప్రొడ‌క్ష‌న్.

రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు ఇదివ‌ర‌కే ఫాంట‌మ్ ఫిల్మ్స్ (అనురాగ్ క‌శ్య‌ప్‌, మ‌ధు మంతెన‌, వికాస్ బాహ‌ల్‌, విక్ర‌మాదిత్య మోత్వాని), రోహిత్ శెట్టి పిక్చ‌ర్జ్, ప్లాన్ సి స్టూడియోస్ (నీర‌జ్ పాండే), వై నాట్ స్టూడియోస్ (ఎస్‌.శ‌శికాంత్‌)తో సృజ‌నాత్మ‌క భాగ‌స్వామ్యాలున్న విష‌యం విదిత‌మే.

సోచా నా నుంచి మొన్న మొన్న‌టి జ‌బ్ వి మెట్‌, ల‌వ్ ఆజ్ క‌ల్‌, రాక్‌స్టార్‌, త‌మాషా, హైవే, జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్ వంటి చిత్రాల‌తో ఇంతియాజ్ అలీ సినీ గోయ‌ర్స్ అంద‌రికీ సుప‌రిచితులే. ఈ సృజ‌నాత్మ‌క‌, వ్యాపారాత్మ‌క క‌ల‌యిక వ‌ల్ల అటు ఇంతియాజ్‌లోని సృజ‌న‌, ఇటు రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గ్లోబ‌ల్ మార్కెటింగ్‌, డిస్ట్రిబ్యూష‌న్ కేప‌బిలిటీస్ క‌లిసి అత్యుత్త‌మ ప్రాజెక్ట్ లు రూపొందిస్తాయి అని విండో సీట్ ఫిల్మ్స్, ఎల్ ఎల్‌పి, కంపెనీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Reliance Entertainment, Imtiaz Ali ink pact for movie production

రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ వైస్ ఛైర్మ‌న్ అమితాబ్ జున్ జున్ వాలా మాట్లాడుతూ ఇంతియాజ్‌తో భాగ‌స్వామ్యం కుదిరినందుకు ఆనందంగా ఉంది. నాణ్య‌త గ‌ల చిత్రాల‌ను, ఆద్యంతం వినోదాత్మ‌క‌మైన, అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేసే చిత్రాల‌ను తీస్తామ‌ని తెలియ‌జేస్తున్నాం అని చెప్పారు. ఇంతియాజ్ అలీ మాట్లాడుతూ విండో సీట్ ఫిల్మ్స్, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కి ఒకేర‌క‌మైన ఆలోచ‌న‌లున్నాయి. కంటెంట్ విష‌యంలో ఇద్ద‌రి ఆలోచ‌న‌ల‌కు మ‌ధ్య సారూప్య‌త ఉంది. అందుకే ఇరువురం క‌లిసి ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేయాల‌నుకుంటున్నాం అని అన్నారు. గ‌తేడాది రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నుంచి వ‌చ్చిన‌ రోహిత్ శెట్టి గోల్‌మాల్ 3 సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాది ఈ సంస్థ నుంచి సూప‌ర్‌స్టార్స్‌ హృతిక్ రోష‌న్‌, ర‌ణ్‌వీర్ సింగ్ చిత్రాలున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X