twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాఖీతో ఆరతి పళ్లెం సిద్ధంగా... కానీ కన్నా నువ్వెక్కడ? కన్నీరు తప్పిస్తున్న సుశాంత్ సోదరి పోస్ట్

    |

    సుశాంత్ సింగ్ రాజ్ పుత్, లోకాన్ని విడిచి నెలలు గడుస్తున్నాయి, అతడి మరణం మిస్టరీగా మారిన నేపథ్యంలో కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఎన్ని పరిణామాలు చోటుచేసుకున్నా, అతడి కుటుంబంలో ఏర్పడిన లోటు మాత్రం ఎవరు పూడ్చలేనిది. ఆ ఇంటికి వెలుగు దివ్వె అయిన సుశాంత్, అక్కల కంటికి ఆశాకిరణంగా పెరిగాడు. తమ చిటికెన వేలు పట్టుకుని పెరిగిన ఆ చిన్ని కన్నయ్య ఈ లోకంలో లేడన్న వార్త జీర్ణించుకోలేకపోతున్న ఆ సోదరీమణి... రక్షాబంధన్ పురస్కరించుకుని ప్రయమైన తమ్ముడికి ఓ కన్నీటి అక్షరధార విడిచింది.

    Recommended Video

    Sushant Singh Rajput : మోదీ గారూ.. మీరే న్యాయం చేయాలి.. అంటూ సుశాంత్ సోదరి లేఖ వైరల్ ! || Oneindia

    "నా కన్నా.. ఇది నా రోజు, నీ రోజు.. మనిద్దరి రోజు. ఎందుకంటే ఈ రోజు రాఖీ పండుగ. 35 ఏళ్ల తరువాత కూడా ఆరతి పళ్లెం నీ కోసం ముస్తాబయింది. పసుపు, గంథం మిళితమైన బొట్టు సిద్ధంగా ఉంది. నీ కిష్టమైన మిఠాయి కూడా ఉంది. కానీ, ఆరతి ఇచ్చేందుకు ఆ అందమైన ముఖమే లేదు. బొట్టుపెట్టేందు విశాలమైన నుదురు లేదు, రాఖీ కట్టేందుకు ఆ చేతులు కనిపించడంలేదు. మిఠాయి తినిపించేందుకు ఆ పెదాలు లేవు, నుదుటిపై ముద్దుపెట్టుకునేందుకు ఆ వదనమూ లేదు.

    కౌగిలించుకునేందుకు తమ్ముడూ లేడు. కొన్నేళ్ల క్రితం నీవు మా జీవితాల్లోకి వచ్చినప్పుడు, నా లోకంలో కొత్త కాంతులు విరజిమ్మాయి. నువ్వే మా కంటి దీపమయ్యావు. కానీ, ఇప్పుడు నువ్వు లేని ఈ లోకంలో ఏం చేయాలో నాకు అర్ధం కావడంలేదు. నీవు లేకుండా జీవించడం నాకు అలవాటు లేదు. ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదే. ఈ రోజు అన్నీ అలానే ఉన్నాయి,కానీ నువ్వు మాత్రమే లేవు. అన్నీ కలసి నేర్చుకున్నామే... మరి నువ్వు లేకుండా జీవిచండం నేనొక్కద్దానే ఎలా నేర్చుకోను?" - నీ రాణీ అక్క...

    Remembering SSR on Rakshabandhan, Sister pens a heartfelt poem

    కన్నీటి ధారలు ఆగకుండా కురుస్తుండగా మనసులోని వేదనంతా అక్షరమాలలుగా మారిన వేళ సుశాంత్ సోదరి లేఖ... చదివిన వారికి కంట కన్నీరు తెప్పించక మానదు. మరోవైపు సుశాంత్ మరో సోదరి శ్వేతా సింగ్ తమ తమ్మడి మరణం వెనుక దాగున్న నిజాలను వెలికి తీయాల్సిందిగా ప్రధాని మోదీకి సోషల్ మీడియా ద్వారా విన్నవించుకున్నారు.

    "నా మనసు చెబుతోంది మీరు నిజానికి బాసటగా నిలుస్తారని, మాది సాధారణ కుటుంబం, మా తమ్ముడికి గానీ, మాకు గానీ బాలీవుడ్ లో ఎలాంటి గాడ్ ఫాదర్ లేరు. మీరు ఈ కేసుపై దృష్టిసారించి, సాక్ష్యాలు తారుమారు అవ్వకుండా, సమగ్ర విచారణ జరిగేలా చూడాలని అభ్యర్ధిస్తున్నాను, మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను" అంటూ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం పోలీసు విచారణలో ఉన్న సుశాంత్ కేసు, సీబీఐకు అప్పగించాల్సిందిగా అన్ని వైపుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

    English summary
    Sushanth Elder sister pens a heartfelt poem on Rakshabandhan, as she beautifully depicts how much she's been missig him on this very special day. Another sister swetha writes to Modi pleading for a fair investigation in his death case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X