ఆ ప్రచారం నమ్మొద్దు.. హీరో పెళ్లికి మా సినిమాకు సంబంధం లేదంటున్న దర్శకుడు!

బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తన ప్రియురాలు నటాషా దలాల్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదే వీరి పెళ్లి జరుగబోతోందనే వార్తలు సైతం తెరపైకి వచ్చాయి. వీరి పెళ్లి కారణంగా ప్రస్తుతం వరుణ్ ధావన్ నటిస్తున్న 'స్ట్రీట్ డాన్సర్ 3డి' చిత్రం ఆలస్యం అవుతోందని, అందుకే రిలీజ్ డేట్ నవంబర్ 2019 నుంచి జనవరి 2020కి వాయిదా వేశారని టాక్.

ఈ వార్తలపై దర్శకుడు రెమో డిసౌజా స్పందించారు. ఓ బాలీవుడ్ పత్రికతో ఆయన మాట్లాడుతూ... వరుణ్ ధావన్ పెళ్లికి, సినిమా ఆలస్యం కావడానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు హెవీగా ఉండటమే ఇందుకు కారణమన్నారు. సాధారణ ఫార్మాట్లో సినిమా చేయడానికి.. 3డిలో చేయడానికి చాలా తేడా ఉంటుందని, అందుకే మేము అనుకున్న సమయంలో పూర్తి కాలేదని తెలిపారు.

 Remo DSouza about Street Dancer 3D release

వరుణ్ ధావన్ పెళ్లి గురించి తనకు తెలియదని, అతడు ఎప్పుడు, ఎవరిని పెళ్లాడబోతున్నాడనే విషయంలో తనకు ఎలాంటి అవగాహన లేదు అన్నారు. వరుణ్ ధావన్ సైతం గతంలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు.

కాగా... వరుణ్ ధావన్ పెళ్లిపై ఆయన తండ్రి డేవిడ్ ధావన్ స్పందిస్తూ...'వరుణ్ పెళ్లి కోసం అందరూ ఎదురు చూస్తున్నారని తెలుసు. వారిలో నేనూ ఒకరిని, వరుణ్ పెళ్లి చేసుకుంటే నాతో పాటు కుటుంబ సభ్యులకు సంతోషమే. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం వరుణ్ ధావన్-నటాసా దలాల్ వివాహం డిసెంబర్ చివరలో జరిగే అవకాశం ఉంది. మూడు రోజుల వేడుకగా ఈ పెళ్లి జరుగబోతున్నట్లు సమాచారం. కాగా... వరుణ్ ధావన్-శ్రద్దా కపూర్ జంటగా నటిస్తున్న 'స్ట్రీట్ డాన్సర్ 3డి' చిత్రం జనవరి 24న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X