స్క్రిప్టులో వేలు పెట్టాడు, అందుకే సినిమా దొబ్బంది: హీరోపై దర్శకుడి సంచలనం
సల్మాన్ ఖాన్ హీరోగా ఈ ఏడాది వచ్చిన బాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ 'రేస్ 3' బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్లాపవ్వడానికి కారణం సల్మాన్ ఖానే అంటూ ఈ చిత్ర దర్శకుడు రెమో డిసౌజా పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. రెమో డిసౌజా ఈ వ్యాఖ్యలు చేయడానికి ముందు 'రేస్ 4' సినిమాకు కూడా ఇతడే దర్శకుడు అనే ప్రచారం జరిగింది. తాజాగా రెమో వ్యాఖ్యలు చూస్తుంటే అతడు రేస్ 4 చిత్రానికి దర్శకుడుగా ఉండే అవకాశం లేదని స్పష్టం అవుతోంది. సల్మాన్ ఖాన్-రెమో డిసౌజా మధ్య విబేధాలు రావడం వల్లనే అతడు ఈ కామెంట్స్ చేసినట్లు భావిస్తున్నారు.

సల్మాన్ ఖాన్ స్కిప్టులో వేలు పెట్టడం వల్లే
ఇటీవల పిటీఐ సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన రెమో డిసౌజా మాట్లాడుతూ... ‘రేస్ 3' సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం స్క్రిప్టులో మార్పులు, సల్మాన్ ఖాన్ ఇన్వాల్వ్‌మెంట్, కథ సరిగా లేక పోవడమే అని వ్యాఖ్యానించారు.

అతడిని నెగెటివ్‌గా చూపించడానికి ఇష్టపడలేదు
రేస్ 3 కథ రెడీ అయినపుడు.... సినిమా సెట్స్ మీదకు వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. సల్మాన్ ఖాన్‌ను నెగెటివ్ రోల్‌లో చూపించడానికి నిర్మాతలు ఇష్టపడలేదు. దాంతో సల్మాన్ ఖాన్ రంగంలోకి దిగాడు, తర్వాత అన్నీ మారిపోయాయి. అతడి క్యారెక్టర్ విషయంలో చాలా మార్పులు జరిగాయి అని రెమో డిసౌజా తెలిపారు.

పబ్లిసిటీ కూడా సరిగా లేదు
సినిమా పబ్లిసిటీ కూడా జరిగా జరుగలేదు. ఇందులో గ్రేట్ యాక్షన్ సీక్వెన్స్, బ్రిలియంట్ స్టంట్స్, ఎంటర్టెనింగ్ డైలాగులు, సాంగ్ నెంబర్స్ ఉన్నాయి. అయితే అవి ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ప్రచారం జరుగలేదు. ఇంతకంటే చెత్త స్క్రిప్టులు ఉన్న సినిమాలను కూడా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు అని రెమో అభిప్రాయ పడ్డారు.

రెమోతో సల్మాన్ మూవీ పదిలమేనా?
రెమో నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘డాన్సింగ్ డాడ్'లో సల్మాన్ ఖాన్ కూడా కనిపించబోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. రెమో చేసిన తాజా కామెంట్స్ చూస్తుంటే ఇందులో సల్మాన్ ఖాన్ ఉండటం డౌటే అనే వాదన వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











