బాలీవుడ్‌లో వరుస డిజాస్టర్లు.. స్టార్ హీరోలపై నిర్మాతల సంచలన నిర్ణయం.. తెలుగు హీరోలు ఆ పని చేస్తారా?
గత కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ సినీ పరిశ్రమ వరుస డిజాస్టర్లతో బెంబేలెత్తుతున్నది. కరోనా తర్వాత హిందీ సినిమా పరిశ్రమ మరీ నిర్వీర్యమైపోయింది. ప్రతీ సినిమా కోట్ల రూపాయల నష్టంతో థియేట్రికల్ రిలీజ్‌లు ముగుస్తున్నాయి. అయితే ఈ విపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు బాలీవుడ్ సినీ పరిశ్రమ సంచలన నిర్ణయం తీసుకొన్నది. ఆ వివరాల్లోకి వెళితే..
గత రెండు, మూడు సంవత్సరాలుగా షారుక్ ఖాన్ తప్పించి.. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్ లాంటి అగ్రహీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. అయితే హీరోల రెమ్యునరేషన్స్, బడ్జెట్ పెరిగిపోవడం వల్ల ఆ మొత్తాన్ని రాబట్టుకోలేక భారీ నిర్మాతలు కూడా చతికిలపడిపోతున్నారనే ఆందోళన వ్యక్తమవుతున్నది.

అయితే ఈ క్రమంలో బాలీవుడ్ సినిమా పరిశ్రమ తమ ఇండస్ట్రీని లాభాల బాట పట్టించేందుకు ప్రక్షాళన మొదలపెట్టింది. ఆ ప్రక్షాళన హీరోల రెమ్యునరేషన్లు, బడ్జెట్, వృథా ఖర్చు తగ్గించే దిశగా అడుగులు వేయాలని నిర్ణయం తీసుకొన్నది. తాజా సమాచారం ప్రకారం కొందరు అగ్ర హీరోలు తమ రెమ్యునరేషన్లు తగ్గించుకొనేందుకు ముందుకు రావడం శుభపరిణామంగా కనిపిస్తున్నది.
అయితే ఇప్పటికే మొదలైన భారీ, చిన్న, మధ్య తరహా సినిమాల బడ్జెట్లను తిరిగి మార్పులు చేస్తున్నారు. ఎక్కడైతే ఎక్కువగా ఖర్చు పెట్టుకూడదో అక్కడ నుంచి వృథాను తగ్గించే ప్లాన్స్‌ను నిర్మాతలు, స్టూడియో ఓనర్లు చేస్తున్నారు. అంతేకాకుండా కొత్తగా ప్రారంభమయ్యే సినిమాలకు సంబంధించిన హీరో, హీరోయిన్లు, ఇతర ఆర్టిస్టుల పారితోషికాలపై మధనం జరుగుతున్నట్టు తెలుస్తున్నది.

ఇప్పటికే ముగ్గురు అగ్ర హీరోలు, నిర్మాతలకు సంబంధించిన బడ్జెట్, ఇతర ఆర్థిక వ్యవహారాలను మదింపు చేశారు. ఇప్పటి వరకు వేసుకొన్న బడ్జెట్ లెక్కలను తగ్గించారు. దీంతో సినిమా నిర్మాణ వ్యయం, అట్టహాసంగా ప్రమోషన్స్ చేయడంపై భారీగా నియంత్రణ పాటించాలని నిర్ణయానికి వచ్చారు.
అయితే బాలీవుడ్ సినిమా పరిశ్రమ నష్టాలను తగ్గించుకోవడానికి ఓ ముందుడుగు వేసింది. ఇలాంటి చర్యలే తెలుగు హీరోలు, తెలుగు నిర్మాతలు తీసుకొనే ప్రయత్నం చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే. ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు కూడా పీకల్లోతు నష్టాల్లో మునిగి తేలుతున్నాయి. సినిమాలకు ప్రేక్షకులు రాకపోవడంతో తెలంగాణలో పలు థియేటర్ల కూడా మూసివేయడం కొత్త సంక్షోభానికి తెర తీసినట్టయిందనే వాదన వినిపిస్తున్నది.
50 ఏళ్ల వయసులో తల్లైన గబ్బర్ సింగ్ భామ.. భర్తకు విడాకులిచ్చి.. ప్రియుడితో రెండో బిడ్డ!


Click it and Unblock the Notifications











