twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో సంచలనం.... శ్రీదేవి మరణం వెనక దావూద్ హస్తం? రూ. 240 కోట్ల ఇన్సూరెన్స్ కోసమేనా?

    By Bojja Kumar
    |

    Recommended Video

    Dawood Ibrahim May Have Hand in Sri Devi's Case?

    ప్రముఖ నటి శ్రీదేవి మరణం ప్రమాదం కాదు, హత్యే అంటూ మరో వాదన తెరపైకి వచ్చింది. ఆమె మరణం వెనక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం హస్తం ఉండొచ్చు అని మాజీ పోలీసుల అధికారి ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె పేరు మీద రూ. 240 కోట్ల ఇన్సూరెన్స్ ఉండటంతో ఆ డబ్బు కోసమే ఆమెను హత్య చేసి ఉంటారనే సందేహాలకు తాజాగా ఆరోపణలు మరింత బలం ఇస్తున్నాయి.

    శ్రీదేవి మరణంపై విచారణ జరిపించాలని కోరుతూ సునీల్ సింగ్ అనే ఫిల్మ్ మేకర్ ఇటీవల సుప్రీం కోర్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఈ పిటీషన్‌ను తోసిపుచ్చింది. కోర్టులో వాదనల సందర్భంగా సునీల్ సింగ్ లాయర్ శ్రీదేవి పేరు మీద ఉన్న రూ. 240 కోట్ల ఇన్యూరెన్స్ విషయం ప్రస్తావించారు. మాజీ పోలీసు అధికారి వ్యాఖ్యలతో అభిమానుల్లో అనుమానాలు మరింత బలపడ్డాయి.

    దుబాయ్‌లో చనిపోతేనే వర్తిస్తుందట!

    దుబాయ్‌లో చనిపోతేనే వర్తిస్తుందట!

    శ్రీదేవి పేరు మీద రూ. 240 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఓమన్ దేశంలో కొనుగోలు చేశారని, ఆ పాలసీ నిబంధనల ప్రకారం శ్రీదేవి దుబాయ్‌లో మరణించినపుడే దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చని కోర్టులో సునీల్ సింగ్ లాయర్ వాదించారు. ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తూ రిటైర్డ్ ఏసీపీ వేద్ భూషణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

     శ్రీదేవి మరణం వెనక దావూద్ హస్తం ఉందంటున్న మాజీ అధికారి

    శ్రీదేవి మరణం వెనక దావూద్ హస్తం ఉందంటున్న మాజీ అధికారి

    తాజాగా శ్రీదేవి మరణంపై రిటైర్డ్ ఏసీపీ వేద్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి మరణం వెనక అండర్ వరల్డ్ డాన్, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు.

    దుబాయ్ పోలీసులను దావూద్ ప్రభావితం చేశాడా?

    దుబాయ్ పోలీసులను దావూద్ ప్రభావితం చేశాడా?

    దేవ్ భూషన్ ప్రస్తుతం ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నడుపుతున్నాడు. దుబాయ్ పోలీసులు శ్రీదేవి మరణంపై జరిపిన ఇన్వెస్టిటేషన్ గురించి దేవ్ భూషన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అక్కడి పోలీస్ వ్యవస్థను సైతం ప్రభావితం చేయగల నెట్వర్క్ దావూద్‌కు ఉందని ఆయన అన్నారు.

     ఆ హోటల్ ఓనర్ కూడా దావూదే

    ఆ హోటల్ ఓనర్ కూడా దావూదే

    దుబాయ్‌లో శ్రీదేవి మరణించిన హోటల్‌కు ఓనర్ కూడా దావూద్ ఇబ్రహీమ్ అని వేద్ భూషణ్ వెల్లడించారు. వేద్ బూషణ్ చెబుతున్న విషయాలు శ్రీదేవి మరణంపై అభిమానుల్లో మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి.

    తన వద్ద ఆధారాలు ఉన్నాయంటున్న దేవ్ భూషణ్

    తన వద్ద ఆధారాలు ఉన్నాయంటున్న దేవ్ భూషణ్

    శ్రీదేవి బాత్రూంలో ప్రమాదవశాత్తు పడిపోయి మరణించినట్లు దుబాయ్ పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో తేల్చారు. కానీ వారి రిపోర్టులో స్పష్టత లేదు. దీని వెనక దావూద్ హస్తం ఉంది. అందుకు తగిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి, సమయం వచ్చినపుడు వాటిని బయట పెడతాను అని వేద్ భూషణ్ చెప్పడం గమనార్హం.

    త్వరలో అన్నీ బయట పెడతాను

    త్వరలో అన్నీ బయట పెడతాను

    సునంద పుష్కర్ కేసును ఢిల్లీ పోలీసులు దాదాపు నాలుగేళ్లుగా విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన అసలు వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. కానీ దుబాయ్ పోలీసులు కేవలం మూడు నాలుగు రోజుల్లో శ్రీదేవి మరణంపై ఫైనల్ రిపోర్ట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ప్రమాద వశాత్తు బాత టబ్‌లో పడిపోయి మరణించినట్లు తమ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసు వెనక అనే అనుమానాలు ఉన్నాయి. మా వద్ద చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. శ్రీదేవి మరణం వెనక ఏం జరిగింది అనేది త్వరలోనే మీడియాకు, ప్రజలకు వెల్లడిస్తాను అని వేద్ భూషణ్ తెలిపారు.

    English summary
    Ex-Delhi Cop, retired ACP Ved Bhushan claims Dawood Ibrahim may have been involved in Sridevi’s murder. Raising questions on the investigation of Dubai police, Bhushan had said that Dawood's influence in the foreign country might have caused a faulty probe. The retired cop, who runs a private investigation agency, said that he has evidence to back his claim, which he would reveal at the right time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X