బాలీవుడ్ హీరోల కంటే ఆ హీరోయిన్లకే ఎక్కువ మగతనం.. తాప్సీ, విద్య, మంచులక్ష్మిపై వర్మ ట్వీట్లు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత మొదటి నుంచి రియా చక్రవర్తికి అండగా నిలుస్తూ ట్వీట్లు చేస్తున్న వారిలో దర్శకుడు రాంగోపాల్ వర్మ ముందుంటారు. ఈ కేసులో మీడియా ట్రయల్స్ చేయడంపై మొదటి నుంచి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమపై వస్తున్న ఆరోపణలపై బాలీవుడ్ హీరోలు స్పందించకపోవడంపై ఆర్జీవి తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో మరోసారి వర్మ చేసిన ట్వీట్ల చర్చనీయాంశమయ్యాయి. ఆయన తాజాగా చేసిన ట్వీట్లు ఏమిటంటే...

అమెరికాలో ప్రకటన బోర్డు తొలగింపుపై
సుశాంత్ సింగ్ కేసు విచారణకు సంబంధించిన విషయాన్ని తెలియజేసే బిల్‌బోర్డును అమెరికాలో తొలగించడంపై రాంగోపాల్ వర్మ స్పందించారు. ఎట్టకేలకు ఈ విషయంలో పారదర్శకత, న్యాయం జరుగుతుందనే ఫీలింగ్ కలుగుతున్నది. రియా చక్రవర్తికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి సంబంధించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బిల్‌బోర్డును అమెరికాలో తొలగించారు అనే విషయాన్ని తన ట్వీట్‌లో వర్మ తెలిపారు.

అర్నబ్, రిపబ్లిక్ టీవీ సొమ్ము చేసుకొంటుంది
సుశాంత్ వద్ద నుంచి రియా చక్రవర్తి ఎంత డబ్బు నొక్కిసిందో లేదో అనే అనుమానాలను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయాన్ని పక్కన పడితే.. సుశాంత్ మరణం విషయంలో రిపబ్లిక్ టెలివిజన్, ఆర్నబ్ గోస్వామి వీలైనంత వరకు డబ్బు సంపాదిస్తున్నట్టు కనిపిస్తున్నది అంటూ వర్మ మరో ట్వీట్ చేశారు.

బాలీవుడ్ హీరోలను చులకన చేస్తూ..
సుశాంత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి లక్ష్మీ మంచు, విద్యా బాలన్, తాప్సీ పన్ను, స్వర భాస్కర్ లాంటి హీరోయిన్లు బహిరంగంగా మద్దతు నిలవడంపై వర్మ స్పందించారు. తన ట్వీట్‌లో బాలీవుడ్ హీరోల తీరును ఎండగట్టారు. అంతేకాకుండా వారిని కించపరిచే విధంగా ట్వీట్ చేశారు.

లక్ష్మీ మంచు, తాప్సీ, విద్యాబాలన్ గురించి
సుశాంత్ సింగ్ కేసులో దర్యాప్తు నిజాయితీగా జరుగాలంటూ రియా చక్రవర్తికి మద్దతునిస్తూ పిచ్చి పట్టిన మీడియా డాగ్స్ ఎదురొడ్డి నిలిచిన తాప్సీ, విద్యాబాలన్, శిభానీదండేకర్, లక్ష్మీ మంచు, స్వరభాస్కర్ ధైర్యానికి మెచ్చుకోవాలి. బాలీవుడ్‌లో మగాళ్ల కంటే ఈ బాలీవుడ్ మహిళలకే ఎక్కువ మగతనం ఉందనే విషయాన్ని రుజువు చేశారు అనే విధంగా ఆర్జీవి ట్వీట్ చేశారు.
Recommended Video

బాలీవుడ్ ప్రముఖుల మౌనంపై
బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్రగ్స్ వినియోగం చేస్తారు అనే ఆరోపణలపై ఎవరూ స్పందించకపోవడంపై పలువురు ప్రశ్నించడంపై కూడా వర్మ స్పందించారు. బాలీవుడ్ ప్రముఖులు డ్రగ్స్ వ్యసనపరులు, రేపిస్టులు, హంతకులు అంటూ విమర్శలు చేస్తుంటే.. ఎవరు కూడా నోరు మెదపకపోవడంపై వర్మ గతంలోనే తప్పుపట్టారు. ఎవరైనా వారికి గట్టిగా సమాధానం ఇవ్వాలని సూచించారు.


Click it and Unblock the Notifications











