డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి ఊరట.. మూడు నెలల తర్వాత పూర్తి ఉపశమనం
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో భాగంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో అరెస్టైన రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తికి బెయిల్ లభించింది. మూడు నెలల తర్వాత ఆయనకు బెయిల్ లభించడంతో రియా చక్రవర్తికి ఊరట లభించింది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు షోవిక్ చక్రవర్తిని, రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రియా చక్రవర్తి నెల రోజుల తర్వాత బెయిల్‌పై బయటకు రాగా, షోవిక్ చక్రవర్తి డిసెంబర్ 2వ తేదీన బెయిల్‌పై విడుదల అయ్యారు.

డ్రగ్స్ కేసులో ప్రత్యేక ఎన్‌డీపీఎస్ కోర్టు న్యాయమూర్తి జీబీ గురావు బుధవారం తీర్పు వెల్లడిస్తూ.. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. నేరం ఒప్పుకోవడం అనేది సాక్ష్యం కిందికి రాదంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు అనుసరించి షోవిక్‌కు బెయిల్ మంజూరు చేశారు.
అరెస్ట్‌కు ముందు రియా చక్రవర్తి, షోవిక్‌పై ఎన్సీబీ తీవ్ర ఆరోపణలు చేసింది. పేమెంట్ గేట్‌వేస్, క్యాష్, క్రెడిట్ కార్డుల ఉపయోగించి డ్రగ్స్‌ను సుశాంత్ సింగ్‌కు షోవిక్ ద్వారా సరఫరా రియా చేసిందనే ఆరోపణలు చేయడం సంచలనం రేపింది.


Click it and Unblock the Notifications











