తీవ్ర విషాదంలో రియా చక్రవర్తి.. నా రియల్ హీరో మృతి అంటూ భావోద్వేగం
బాలీవుడ్ నటి రియా చక్రవర్తి మరో విషాదం వెంటాడింది. కోవిడ్ బారిన పడిన తన కుటుంబ సభ్యుడు మృతి చెందడంపై భావోద్వేగానికి గురయ్యారు. తన అంకుల్ మరణంపై విచారం వ్యక్తం చేస్తూ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో సంతాపం వ్యక్తం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
రియా చక్రవర్తి అంకుల్ కల్నల్ ఎస్ సురేష్ కుమార్ వీఎస్ఎమ్ కరోనా వ్యాధికి గురయ్యారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఆర్మీ రిటైర్డ్ ఆఫీసరైన ఆయన వయసు 52 సంవత్సరాలు. దేశానికి ఎన్నో సంవత్సరాలు సేవలందించారు.

సురేష్ కుమార్ మృతిపై ఎమోషనల్ అయిన రియా చక్రవర్తి ఆయనను రియల్ హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. సైన్యంలో పలు సంవత్సరాలు ఆర్థోపెడిక్ సర్జన్‌గా సేవలందించారు. గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి. ఆయన సేవలకు నా సెల్యూట్. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అందరూ జాగ్రత్తగా ఉంటూ ఇంటి పట్టునే ఉండాలి అంటూ తన పోస్టులో రియా చక్రవర్తి పేర్కొన్నారు.
రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి 20 సంవత్సరాలపాటు సైన్యంలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆర్మీలో ఆయన డాక్టర్‌గా సేవలందించారు. సురేష్‌కు ఇంద్రజిత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రియా చక్రవర్తి ఈ సందర్భంగా ప్రస్తావించారు.


Click it and Unblock the Notifications











