రియా చక్రవర్తి మెడకు మరో కేసు? సుశాంత్ డెబిట్ కార్డు పాస్‌వర్డుల అపహరణ.. మేనేజర్‌తో కలిసి
డ్రగ్ మాఫియాతో లింకులు అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయనే మాట బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నది. డ్రగ్స్ కొనుగోలు వ్యవహారంలో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ మాజీ మేనేజర్ శృతి మోడీ, ఆర్య గౌరవ్‌పై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన ఎన్సీబీ అధికారులుకు షాకింగ్ కలిగించే విషయాలు బయటపడినట్టు సమాచారం. ఆ వివారాల్లోకి వెళితే..

డ్రగ్ మాఫియాతో సంబంధాలు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో విచారణ ప్రారంభించిన ఈడీ అధికారులు రియా చక్రవర్తి రెండు ఫోన్లను స్వాధీన పరుచుకొన్నారు. ఆ ఫోన్లను తనిఖీ చేసిన క్రమంలో డ్రగ్స్ మాఫియాతో ఉన్న లింకులు బయటపడ్డాయి. దాంతో ఎన్సీబీ అధికారులకు సమాచారం అందించారు. ఈ వ్యవహారంలో తీగ లాగితే డ్రగ్ సప్లైయర్ల డొంక కదిలిందనే మాట వినిపించింది.

20 మందితో డ్రగ్స్ జాబితా
డ్రగ్స్ సప్లై వ్యవహారంలో దాదాపు 20 మందితో కూడిన పేర్లను ఎన్సీబీ అధికారులు సిద్ధం చేశారు. త్వరలోనే వారందరినీ విచారించే అవకాశం ఉంది. ఎన్సీబీ రూపొందించిన జాబితాలో రియాకు సన్నిహితుడైన గౌరవ్ ఆర్య, సువేద్ లోహియా, జయా సహా, బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఇజాజ్ ఖాన్, ఫరూక్ భటాటా, బకుల్ చాందానీ లాంటి పేర్లు ఉన్నట్టు సమాచారం.

రియా ఫోన్లను తనిఖీ చేస్తున్న ఈడీ
సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులకు సంచలన విషయాలు దృష్టిలోకి వచ్చాయి. బ్యాంకు ఖాతాల దుర్వినియోగం, డ్రగ్స్ వ్యవహారాలతో రియాకు సంబంధాలు అధికారులకు ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తున్నాయి. ఇవేయే కాకుండా ఫోన్ డేటాలో పలువురు కీలక వ్యక్తులు రియాతో టచ్‌లో ఉన్నారనే విషయాలు షాకింగ్‌గా మారాయి.
Recommended Video

సుశాంత్ డెబిట్ కార్డులు దొంగిలించి..
సుశాంత్ మరణానికి ముందు రియా చక్రవర్తి వ్యవహార తీరు అనేక అనుమానాలకు తావిస్తున్నది. మేనేజర్ శ్యామ్యూల్ మిరాండా సహాయంతో సుశాంత్ డెబిట్ కార్డులకు సంబంధించిన పాస్‌వర్డులను దొంగిలించారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ల్యాప్‌టాప్స్, కంప్యూటర్ల డేటాను క్లీన్ చేసినట్టు మరో ఆరోపణ కూడా అధికారుల పరిశీలనకు వచ్చింది.


Click it and Unblock the Notifications











