నా పడక‌పైకి వచ్చి అసభ్యంగా నన్ను తడిమింది.. సుశాంత్ సోదరిపై రియా చక్రవర్తి ఆరోపణలు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రియురాలు రియా చక్రవర్తి ఎదురుదాడి ప్రారంభించింది. సుశాంత్ మరణానికి ముందు తాను ఆ ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయాననే విషయాన్ని వెల్లడిస్తూ తన తరఫు న్యాయవాది సతీష్ మానేషిండేతో ప్రకటన రిలీజ్ చేయించారు. సుశాంత్ కుటుంబం, సోదరి ప్రియాంక సింగ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. రియా చక్రవర్తి న్యాయవాది సతీష్ సుదీర్ఘమైన లేఖలో పలు విషయాలను ఆమె తరఫున ప్రస్తావిస్తూ..

 రియా చక్రవర్తికి చట్టాలంటే అపారమైన గౌరవం

రియా చక్రవర్తికి చట్టాలంటే అపారమైన గౌరవం

నా క్లయింట్ రియా బాధ్యతయుతమైన పౌరురాలు. ఆమెకు చట్టాలంటే అపారమైన గౌరవం ఉంది. ఆమె భారతీయ ఆర్మీలో డాక్టర్ కూతురు. సుశాంత్ తండ్రి ఆరోపణల మేరకు పలు బ్యాంకు అకౌంట్లలో అవకతవకలపై వాస్తవాలు వెల్లడించడానికి ఈడీ విచారణకు హాజరయ్యారు. అవసరమైతే మరింత సమాచారం అందించడానికి రియా సిద్దంగా ఉంది అంటూ సతీష్ మాన్‌షిండే తన ప్రకటనలో తెలిపారు.

ఎలాంటి దర్యాప్తుకైనా రియా సిద్ధం

ఎలాంటి దర్యాప్తుకైనా రియా సిద్ధం

ముంబై పోలీసుల విచారణకు ఇప్పటికే హాజరయ్యారు. ఈ కేసులో సీబీఐనే కాదు థర్డ్ పార్టీ ఏజెన్సీ దర్యాప్తనకు హాజరు కావడానికి సిద్దంగా ఉన్నారు. సుశాంత్ కేసులో తాను నిర్దోషినని నిరూపించడానికి ఎలాంటి విచారణకైనా ఆమె సిద్దంగా ఉన్నారు. ఆమెపై వస్తున్న ఆరోపణలపై మౌనం దాల్చితే తప్పు చేసినట్టు అవుతుంది. అందుకే ఈ కేసు తన బలహీనతగా మారకముందే నిజాలు చెప్పాలని రియా చక్రవర్తి నిర్ణయించుకొన్నారు అని సతీష్ మాన్‌షిండే తన లేఖలో పేర్కొన్నారు.

 సుశాంత్ డేటింగ్ చేస్తూ

సుశాంత్ డేటింగ్ చేస్తూ

గత కొన్నేళ్లుగా రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మధ్య పరిచయం ఉంది. వారిద్దరి మధ్య తొలుత స్నేహబంధం ఉంది. ఆ తర్వాత సినీ వర్గాల ఏర్పాటు చేసిన పార్టీ తర్వాత వారిద్దరూ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. అనంతరం వారిద్దరూ ఒకరి ఇంట్లో మరొకరు గడపడం మొదలుపెట్టారు. డిసెంబర్ 2019 నుంచి బాంద్రాలోని సుశాంత్ ఇంట్లో రియా కలిసి ఉంటున్నారు. జూన్ 8 తేదీ వరకు ఆ ఇంట్లోనే వారిద్దరి కలిసి ఉన్నారు అని సతీష్ మాన్‌షిండే తన ప్రకటనలో తెలిపారు.

 సుశాంత్ ఇంటికి వెళ్లిన సమయంలో

సుశాంత్ ఇంటికి వెళ్లిన సమయంలో

తమ డేటింగ్ తొలి రోజుల్లో సుశాంత్ ఇంటికి రియా చక్రవర్తి వెళ్లారు. ఆ సమయంలో సుశాంత్ సోదరి ప్రియాంక, ఆమె భర్త సిద్ధార్థ్ ఇంట్లోనే ఉన్నారు. ఏప్రిల్ 2019లో రియా, ప్రియాంక ఓ రాత్రి పార్టీకి హాజరయ్యారు. ప్రియాంక పీకల వరకు తాగి కొందరు పురుషులు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సుశాంత్, ఆయన సోదరి మళ్లీ ఆల్కాహాల్ సేవించారు అని సతీష్ మాన్‌షిండే తన సుదీర్ఘమైన లేఖలో పేర్కొన్నారు.

సుశాంత్ ఇంట్లో పడుకొంటే..

సుశాంత్ ఇంట్లో పడుకొంటే..

అయితే సుశాంత్, ఆమె సోదరి చేసుకొంటున్న పార్టీలో పాల్గొనకుండా నాకు ఉదయం షూటింగు ఉందని తొందరగానే నిద్రపోయాను. అయితే అర్ధరాత్రి నా బెడ్ మీదకు వచ్చి నాపై పడింది. నా శరీరాన్ని తడుముతూ అదోలా ప్రవర్తించింది. దాంతో షాక్ తిన్న నా క్లయింట్ ఆమెను గది నుంచి బయటకు వెళ్లమని అరిచింది. ఆ తర్వాత ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత తన సోదరి చేసిన నిర్వాకాన్ని సుశాంత్‌కు తెలియజేయడంతో వారిద్దరి మధ్య ఆ విషయపై ఘర్షణ జరిగిందని నా క్లయింట్ వెల్లడించింది అని సతీష్ మాన్‌షిండే పేర్కొన్నారు.

Recommended Video

Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
అప్పటి నుంచి ఫ్యామిలీలో సంబంధాలు కట్

అప్పటి నుంచి ఫ్యామిలీలో సంబంధాలు కట్

అప్పటి నుంచి సుశాంత్ కుటుంబానికి, తన మధ్య సంబంధాలు చెడిపోయాయి. వారితో మాట్లాడానికి నా క్లయింట్ ఇష్టపడలేదు. కేవలం సుశాంత్‌తో మాత్రమే సఖ్యతతో ఉన్నారు. సుశాంత్ అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరుకావాలనే లాక్‌డౌన్ పరిమితులు ఉండటం కారణంగా అక్కడికి వెళ్లలేదని రియా చక్రవర్తి తరఫు న్యాయవాది సతీష్ మాండే విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X