చాలా రోజుల తరువాత మీడియా కంట పడిన రియా చక్రవర్తి.. ఏం చేస్తోందంటే..

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని మిగిల్చిన సుశాంత్ సింగ్ సూసైడ్ ఘటన జరిగి నెలలు గడుస్తున్నా ఇంకా అతని అభిమానులు మరచిపోలేకపోతున్నారు. కొంతమంది సినీ తారలు కూడా ఇంకా సుశాంత్ ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. సుశాంత్ మరణించిన తరువాత అతని గర్ల్ ఫ్రెండ్ అయిన హీరోయిన్ రియా చక్రవర్తి అనేక రకాల కేసులతో సమస్యలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

సుశాంత్ మరణం తరువాత రియాకు బెదిరింపులతో కూడా సందేశాలు వచ్చాయి. రియా చక్రవర్తి తన సోదరుడి కారణంగా కూడా డ్రగ్స్ వివాదంతో సతమతమైన విషయం తెలిసిందే. ఇక జైలు జీవితం అనంతరం చాలా రోజుల పాటు ఒంటరిగా సమయాన్ని గడిపిన ఆమె మళ్ళీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటిలానే బిజీ అవ్వాలని అనుకుంటోంది. చాలా రోజుల తరువాత ఆమె ముంబైలోని ఒక జిమ్ బయట కనిపించింది. మీడియా కెమెరాలు స్టిల్స్ కావాలని ఆమెను రిక్వెస్ట్ చేసినా కూడా ఏమి పట్టనట్లుగానే వెళ్లిపోయింది.

Rhea Chakraborty and Showik spotted in a gym

రియాతో పాటు డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఆమె సోదరుడు షోవీక్ బెయిల్ ద్వారా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక రియా, షోవీక్ ఇద్దరు కూడా జిమ్ వర్కౌట్స్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. పాత చేదు జ్ఞాపకాలను మర్చిపోయి మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వారికి సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక బాలీవుడ్ లో రియా చక్రవర్తి రెండు సినిమాలు చేయడానికి రెడీగా ఉంది. తెలుగులో ఆమె సూపర్ మచ్చి అనే సినిమా చేసింది. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ ఆ సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X