‘సుశాంత్ డ్రగ్ ఎడిక్ట్.. రియా అరెస్ట్‌తో అపహాస్యం, ప్రేమిస్తే జంతువును వేటాడినట్టు’

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో దేశం మొత్తం ఊహించినట్టుగానే బాలీవుడ్ తార రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత ఆమెను సియాన్ హాస్పిటల్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇంతకు ముందు ఈ కేసులో రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ మేనేజర్ శ్యామ్యూల్ మిరాండా, పనిమనిషి దీపేష్ సావంత్‌ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం రియాను కస్టడీలోకి తీసుకోవడంతో బాలీవుడ్‌లో కలకలం చెలరేగింది. ఈ ఘటనపై రియా చక్రవర్తి లాయర్ సతీష్ మాన్‌షిండే తీవ్రంగా స్పందిస్తూ..

రియా అరెస్ట్‌తో న్యాయ వ్యవస్థ అపహాస్యం

రియా అరెస్ట్‌తో న్యాయ వ్యవస్థ అపహాస్యం

రియా చక్రవర్తి అరెస్ట్‌తో న్యాయవ్యవస్థ అపహాస్యం పాలైంది. డ్రగ్స్ వ్యసనపరుడిని ప్రేమించినందుకు రియాను జంతువును వేటాడినట్టు దర్యాప్తు సంస్థలు వెంటాడాయి. కొన్నేళ్లుగా మానసిక రుగ్మతకు లోనైన వ్యక్తి సంరక్షణకు కోసం ఆరాటపడిన యువతికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆ వ్యక్తి డ్రగ్స్‌, అక్రమంగా మెడిసిన్స్ వాడి ఆత్మహత్య చేసుకొంటే రియాకు తీరని శాపంగా మారింది అంటూ సతీష్ మాన్‌షిండే అన్నారు.

సుశాంత్ సోదరిని అరెస్ట్ ఎందుకు చేయలేదు..

సుశాంత్ సోదరిని అరెస్ట్ ఎందుకు చేయలేదు..

మరణించిన నటుడు (సుశాంత్)కు ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకుండా వైద్యం చేసిన డాక్టర్‌ను, ఆ వైద్యానికి సహకరించిన ఆయన సోదరి ప్రియాంకను ఈకేసులో ఎందుకు అరెస్ట్ చేయలేదు. సుశాంత్ ఫ్యామిలీని కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయాలి అంటూ సతీష్ మాన్‌షిండే అభిప్రాయపడ్డారు.

సుశాంత్ సిస్టర్స్, డాక్టర్‌పై కేసు

సుశాంత్ సిస్టర్స్, డాక్టర్‌పై కేసు

ఇదిలా ఉండగా, రియా చక్రవర్తి తన అరెస్ట్‌కు ముందు సుశాంత్ మరణానికి వారి కుటుంబ సభ్యులే ప్రేరేపించారంటూ బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వైద్య నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకుండా రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ డాక్టర్ తరుణ్ కుమార్; సుశాంత్ సిస్టర్స్ ప్రియాంక, మీతూలపై ఫిర్యాదు చేశారు. ఎన్‌డీపీఎస్ యాక్ట్‌ పరిధిలోకి వచ్చే మందులను సూచించారంటూ డాక్టర్‌పై ఆరోపణలు చేశారు.

వారిపై కూడా చర్యలు తీసుకోండి..

వారిపై కూడా చర్యలు తీసుకోండి..

అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్‌ను సుశాంత్‌కు ఇవ్వడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకొన్నారు. ఆయన మానసిక రుగ్మతకు ఇలాంటి మందులే కారణమయ్యాయి. కాబట్టి అందుకు కారణమైన సుశాంత్ కుటుంబంపై, డాక్టర్‌పై కేసు నమోదు చేయాలని రియా తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X