రియా చక్రవర్తి అరెస్ట్‌కు రంగం సిద్ధం.. మహేష్ భట్‌తో ఛాటింగ్‌తో బండారం బట్టబయలు అంటూ..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు దర్యాప్తు కోసం సీబీఐ రంగంలోకి దిగిన తర్వాత ముంబైలో పరిస్థితులు శరవేగంగా మార్పులు చోటుచేసుకొంటున్నాయి. సీబీఐ అధికారులు బృందాలుగా చీలిపోయి పలు అంశాలపై విచారణను వేగవంతం చేశారు. కేసుకు సంబంధించిన ప్రతీ ఒక్కరిని ఊపిరి సలపనివ్వకుండా చేస్తూ తమదైన శైలిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రియా చక్రవర్తి అరెస్ట్‌పై ఊహగానాలు ఊపందుకొంటున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

బృందాలుగా విడిపోయి
సోమవారం రోజు సీబీఐ అధికారులు పలు బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టారు. కూపర్ హాస్పిటల్‌లో పోస్టుమార్టమ్ చేసిన వైద్యులను ప్రశ్నించగా, మరో బృందం కొటక్ బ్యాంక్‌కు వెళ్లి రూ.15 కోట్ల అవకతకవలపై దృష్టి సారించారు. అలాగే వాటర్‌స్టోన్ రిసార్ట్‌లోని అధ్యాత్మిక గురువును, అలాగే సిద్దార్థ పితాని, వంట మనిషి నీరజ్‌ను ప్రశ్నించారు. మరో బృందం రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తిని విచారించారు.

కూపర్ హాస్పిటల్ రిపోర్టులపై అసంతృప్తి
సుశాంత్ పోస్టు మార్టమ్‌పై కూపర్ హాస్పిటల్ వర్గాలు వెల్లడిస్తున్న విషయాలపై సీబీఐ అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. వారు చెబుతున్న విషయాలు పొంతన లేకుండా ఉన్నాయనే విషయాన్ని మీడియా తమ కథనాలుగా వెల్లడిస్తున్నాయి. సుశాంత్ మరణం తర్వాత 12 గంటల అనంతరం పోస్టు మార్టమ్ చేశామని హస్పిటల్ వర్గాలు చెప్పిన విషయంపై సీబీఐ అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది.

సహకరించకుంటే అరెస్టే..
సుశాంత్ కేసులో ఇలాంటి పరిస్థితులను బేరీజు వేస్తూ రాజ్‌పుత్ కుటుంబం తరఫున న్యాయవాది వికాస్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రియాను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తారు. విచారణ ప్రారంభమైన తర్వాత రియాకు ఇబ్బందులు మొదలవుతాయి. అధికారులకు సహకరించకుండా మొండికేస్తే.. అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొంటారు. ఈ కేసులో సీబీఐ విచారణ సరైన దిశలో వెళ్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

అరెస్ట్ తప్ప మరో మార్గం లేదు
ఇదిలా ఉండగా, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో రియాను ఎందుకు అరెస్ట్ చేయకూడదు. పొంతనలేని సమాధానాలు, సాక్ష్యాలను ఇస్తున్న ఆమెకు అరెస్ట్ తప్ప మరో గత్యంతరం ఏదీ కనిపించడం లేదు. ఆమెను కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే అసలు విషయాలు బయటపడుతాయి అని ఆయన అన్నారు.
Recommended Video

మహేష్ భట్ చాటింగ్‌తో బండారం బయటకు
రియా అరెస్ట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ సుబ్రమణ్యస్వామి.. ట్వీట్ చేస్తూ.. మహేష్ భట్‌తో చాటింగ్ విషయంతో ఆమె బండారం బయటపడింది. ఆయనతో ఉన్న సంబంధాల విషయంలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. సాక్ష్యాలు, ఆమె వాగ్మూలం భిన్నంగా ఉంది. ఆమెను కస్టోడియల్ విచారణ చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











