చెయ్యెత్తి జైకొట్టిన రియా చక్రవర్తి .. అరెస్ట్ తర్వాత తెరపైకి 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు

రియా చక్రవర్తిని అరెస్ట్ చేసినట్టు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా ధృవీకరించారు. పేపర్ వర్క్స్, ఇతర ఫార్మాలిటీస్ పూర్తవుతున్నాయి. త్వరలోనే అధికారికంగా సమాచారం వెల్లడిస్తాం అని ఆయన తెలిపారు. అరెస్ట్ ధృవీకరించడానికి ముందు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

Recommended Video

Rhea Chakraborty : చేతిని గాలిలోకి ఊపుతూ వింతగా ప్రవర్తించిన రియా చక్రవర్తి ! || Oneindia Telugu
2016 నుంచి డ్రగ్స్ వాడుతున్నట్టు

2016 నుంచి డ్రగ్స్ వాడుతున్నట్టు

2016 నుంచి సిగరెట్లలో నిషేధిత డ్రగ్స్ నింపుకొని తాగినట్టు రియా చక్రవర్తి అంగీకరించినట్టు సమాచారం. అంతేకాకుండా గంజాయి, మారిజువానా లాంటి మత్తు పదార్థాలను విరివిగా వినియోగించినట్టు అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. సుశాంత్‌తో కలిసి సిగరెట్లు తాగినట్టు అంగీకరించినట్టు కథనాలు వెలువడుతున్నాయి.

 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు

25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు

రియా చక్రవర్తిని విచారించిన సమయంలో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోలు, హీరోయిన్ల పేర్లు బయటపెట్టినట్టు తెలుస్తున్నది. దాదాపు 25 మంది ప్రముఖులు పేర్లు వెల్లడించినట్టు సమాచారం. దీంతో డ్రగ్స్ మాఫియాతో ఎవరెవరికీ సంబంధాలు ఉన్నాయనే విషయంపై విపరీతమైన చర్చ జరుగుతుంది.

రియాపై పెట్టిన సెక్షన్లు ఇవే

రియాపై పెట్టిన సెక్షన్లు ఇవే

రియాను దాదాపు 19 గంటలపాటు విచారించిన తర్వాత ఎన్టీపీఎస్ (NDPS) యాక్ట్ 1985 కింద సెక్షన్ 89 (c), 20 (b), 27 (a), 28, 29 కింద అరెస్ట్ చేసినట్టు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ సమకూర్చుకోవడం, వినియోగించడం, ఇతరులతో కలిసి తీసుకోవడం, నేరపూరిత కుట్ర అంశాల కింద రియాపై కేసు నమోదు చేసినట్టు సమాచారం.

 వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ముందుకు

వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ముందుకు

తాజా అరెస్ట్ నేపథ్యంలో రియాను సియాన్ హాస్పిటల్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిసింది. ఆమెను హాస్పిటల్‌లో వైద్య పరీక్షలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఎన్సీబీ తమ కస్టడీలోకి తీసుకొనే అవకాశం ఉంది.

రియా చైయ్యెత్తి జై కొట్టి.. గాలిలోకి ఊపుతూ

రియా చైయ్యెత్తి జై కొట్టి.. గాలిలోకి ఊపుతూ

రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఆమెను భారీ భద్రత మధ్య వ్యాన్‌లోకి ఎక్కించారు. వ్యాన్ ఎక్కిస్తున్న సమయంలో ఆమె చెయ్యి జై కొట్టింది. చేతిని గాలిలోకి ఊపుతూ ఆమె వ్యాన్‌లోకి వెళ్లిపోయారు. దీంతో ఆమె తీరు మరోసారి చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X