రియాకు ఎదురుదెబ్బ.. బెయిల్ పిటీషన్ తిరస్కరణ.. 14 రోజులు కస్టడీలో
సుశాంత్ సింగ్ కేసులో ప్రస్తుతం డ్రగ్స్ మాఫియా డొంక కదులుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ డ్రగ్స్ చీకటి కోణాలు బయటకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. రియా చక్రవర్తి అరెస్ట్, విచారణతో ఇండన్ట్రలోనీ కొందరి పేర్లు బయటకు వచ్చాయని తెలుస్తోంది. ఇక డ్రగ్స్ కేసులో మూడు రోజులు సుధీర్ఘ విచారణలో రియా ఎన్నో విషయాలను చెప్పిందని పోలీసులు తెలిపార. కానీ బెయిల్ పిటీషన్‌లో మాత్రం దానికి భిన్నంగా పేర్కొంది రియా.
Recommended Video

మూడు రోజుల విచారణ..
సుశాంత్ సింగ్‌కు నిషేదిత డ్రగ్స్ ఇచ్చారని ఇందులో రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి, మేనేజర్ శ్యాముల్ మిరాందాల హస్తం ఉందని ముందుగా వీరిని అరెస్ట్ చేశారు. సోదరి ఆదేశాలతోనే సుశాంత్‌కు డ్రగ్స్ ఇచ్చానని విచారణలో అంగీకరించడంతో రియాను అదుపులోకి తీసుకుని మూడు రోజుల పాటు విచారించారు.

అరెస్ట్‌తో సెన్సేషన్..
మూడు రోజుల విచారణ, ఇంట్లో సోదాల అనంతరం రియాను బుధవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుశాంత్ మద్దతుదారులంతా సంబరాలు చేసుకుంటే.. రియా సపోర్టర్స్ మాత్రం మీడియాపై సెటైర్లు వేసుకుంటూ ఉన్నారు.

బెయిల్ పిటీషన్..
రియా అరెస్ట్ అయిన తరువాత ఆమె లాయర్ చేసిన వ్యాఖ్యలు ఎంతగానో వైరల్ అయ్యాయి. ఆమె డ్రగ్స్‌కు బానిసైన వాడిని ప్రేమించింది అంటూ సుశాంత్‌పై ఆరోపణలు చేశాడు. ఇక రియా సైతం బెయిల్ పిటీషన్‌లో సంచలన కామెంట్స్ చేసింది. తనను బెదిరించి అలా చెప్పించాని పేర్కొంది.

14 రోజులు కస్టడీ..
రియా చక్రవర్తి బెయిల్ పిటీషన్‌ను ముంబై సెషన్స్ కోర్టు పరిశీలించింది. బెయిల్ ఇవ్వడం కుదరదంటూ ఆ పిటీషన్‌ను కొట్టివేసింది. కేవలం రియాకే కాదు.. షోవిక్‌తో పాటు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఏ ఒక్కరికీ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. మళ్లీ సోమవారం నాడు రియా బెయిల్ గురించి కోర్టుకు విన్నవించుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రియాను పద్నాలుగు రోజులు కస్టడీలో ఉంచనున్నట్టు ఎన్‌సీబీ తెలిపింది.


Click it and Unblock the Notifications











